ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలకు సీఎం ఆదేశం గత ప్రభుత్వం ట్రూ అప్‌తో బాదితే, మేం ట్రూ డౌన్‌తో తగ్గిస్తున్నామన్న చంద్రబాబు విద్యుత్ ఛార్జీల తగ్గింపు, సమర్థ నిర్వహణపై ప్రజలకు వివరించాలన్న సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమర్థ, అసమర్థ పాలన మధ్య ఉన్న వ్యత్యాసాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలని ఆయన సూచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు పలు కీలక అంశాలపై మాట్లాడారు. విద్యుత్ రంగంలో ‘ట్రూ డౌన్’ విధానం గత ప్రభుత్వం ‘ట్రూ అప్’ ఛార్జీల పేరుతో ప్రజలపై విద్యుత్ భారం మోపిందని, కానీ తమ కూటమి ప్రభుత్వం ‘ట్రూ డౌన్’…
Read More