తన మెచ్యూరిటీకి సరిపోయే వ్యక్తి దొరకాలన్న నటి ప్రస్తుతం పెళ్లిపై ఆశలు లేవని, పిల్లలే ముఖ్యమని వెల్లడి తన పెళ్లికి కొన్ని కండిషన్లు ఉంటాయని వ్యాఖ్య తెలుగు ప్రేక్షకులకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు పొందిన నటి ప్రగతి, తన రెండో పెళ్లిపై వస్తున్న పుకార్లకు తాజాగా స్పష్టత ఇచ్చారు. సోషల్ మీడియాలో ఫిట్నెస్, వర్కౌట్ వీడియోలతో ఎప్పటికప్పుడు చర్చలో ఉండే ఆమె, ఈసారి తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ఊహాగానాలకు తెరదించారు. ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేసిన ప్రగతి, భవిష్యత్తులో ఒకవేళ జీవన భాగస్వామి అవసరమని అనిపిస్తే కొన్ని కండిషన్లు తప్పనిసరిగా ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “జీవితంలో ఒక తోడు అవసరం అనేది నిజమే. కానీ, ఆ వ్యక్తి నా మెచ్యూరిటీ స్థాయికి తగినవాడై ఉండాలి.…
Read More