30 ఏళ్ల క్రితం దేశాన్ని ఊపేసిన వర్మ చిత్రం ‘రంగీలా’ ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా నిలిచిపోయిన ఊర్మిళ ‘రంగీలారే’ పాటకు డ్యాన్స్ చేస్తూ వీడియో పంచుకున్న ఊర్మిళ సినీనటి ఊర్మిళ మటోండ్కర్ తన అందం, అభినయంతో ఒకప్పుడు యువతను ఉర్రూతలూగించారు. ఆమె సినీ ప్రస్థానంలో ఎంతో కీలకమైన ‘రంగీలా’ సినిమా విడుదలై 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఆ చిత్రంలోని ఐకానిక్ పాటకు డ్యాన్స్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు. మూడు దశాబ్దాల తర్వాత కూడా తనలో అదే గ్రేస్ ఉందని నిరూపిస్తూ ఆమె పంచుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రంగీలా మ్యాజిక్ ‘రంగీలా’ సినిమా 30 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఊర్మిళ తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ చిత్రంలోని సూపర్…
Read More