Samantha : విజయం అంటే నంబర్లు కాదు: సమంత సంచలన వ్యాఖ్యలు

Success Isn't Just About Numbers: Samantha's Candid Revelation

విజయంపై తన ఆలోచనలు మారాయన్న సమంత గతంలో నంబర్లు, లెక్కలతోనే బతికానని వెల్లడి ఒకప్పుడు వరుస సినిమాలు, బ్లాక్‌బస్టర్‌ హిట్లు, టాప్‌ జాబితాలో స్థానం.. వీటినే విజయానికి కొలమానంగా భావించానని అగ్ర కథానాయిక సమంత అన్నారు. తన స్థానాన్ని ఇంకెవరైనా భర్తీ చేస్తారేమోనన్న భయంతో, తన ఆత్మగౌరవాన్ని పూర్తిగా నంబర్లతోనే ముడిపెట్టి చూశానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాతగా ‘మా బంగారు తల్లి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్‌, వ్యక్తిగత ఆలోచనలపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గతంలో తన ఆలోచనా విధానం గురించి వివరిస్తూ, “గ్యాప్ లేకుండా సినిమాలు చేయడమే సక్సెస్ అని బలంగా నమ్మేదాన్ని. ఏడాదికి ఐదు సినిమాలు విడుదలైన రోజులు కూడా ఉన్నాయి. దాన్నే పెద్ద విజయంగా భావించి అపోహ పడ్డాను. ఎప్పుడూ…

Read More