చైనాలోని షెజాంగ్ ప్రావిన్స్ పరిశోధకుల ఘనత కేవలం మూడు నిమిషాల్లోనే ఎముకలు అతుక్కునేలా రూపకల్పన సముద్రపు ఆల్చిప్పల జిగురు గుణం నుంచి ప్రేరణ వైద్యరంగంలో చైనా శాస్త్రవేత్తలు మరో గొప్ప ఆవిష్కరణను వెలుగులోకి తెచ్చారు. విరిగిన ఎముకలను అతికించడానికి గంటల తరబడి శస్త్రచికిత్సలు, స్టీల్ ప్లేట్లు, స్క్రూలు అవసరం లేకుండా, కేవలం మూడు నిమిషాల్లోనే ఆ పనిని పూర్తి చేసే ఒక ప్రత్యేకమైన ‘బోన్ గ్లూ’ను అభివృద్ధి చేశారు. ఇది ఆర్థోపెడిక్స్లో ఒక విప్లవాత్మకమైన మార్పు అని నిపుణులు భావిస్తున్నారు. బోన్ గ్లూ ఎలా పనిచేస్తుంది? తూర్పు చైనాలోని షెజాంగ్ ప్రావిన్స్‌కు చెందిన పరిశోధకులు దీనికి ‘బోన్ 02’ అని పేరు పెట్టారు. సముద్రంలోని ఆల్చిప్పలు నీటిలో కూడా గట్టిగా అతుక్కునే లక్షణం నుంచి ప్రేరణ పొంది ఈ జిగురును రూపొందించారు. దీనిపై పరిశోధనకు నాయకత్వం వహించిన…
Read More