‘ఓమీ’ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించిన శర్వానంద్ సంస్థను లాంఛనంగా ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇది కేవలం బ్రాండ్ కాదని, భవిష్యత్ తరాల కోసం ఓ విజన్ అన్న శర్వానంద్ టాలీవుడ్‌లో ఫ్యామిలీ హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శర్వానంద్ ఇప్పుడు నిర్మాతగా సరికొత్త ప్రయాణం మొదలుపెట్టారు. ‘ఓమీ’ పేరుతో ఆయన ఒక నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ సంస్థను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శర్వానంద్ తన భవిష్యత్ ప్రణాళికలను మీడియాకు వివరించారు. శర్వానంద్ మాట్లాడుతూ, ‘ఓమీ’ కేవలం ఒక బ్రాండ్ మాత్రమే కాదని, భవిష్యత్ తరాల కోసం ఒక దార్శనికతతో దీనిని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నిబద్ధత, మంచి సంకల్పం, బాధ్యతలతో కూడిన ఒక కొత్త అధ్యాయానికి ఇది నాంది అని ఆయన ప్రకటించారు.…
Read More