Karnataka Politics కర్ణాటక ముఖ్యమంత్రి పదవి చుట్టూ సాగుతున్న సందిగ్ధతలు, అంతర్గత విభేదాలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సూచనలపై సిద్ధరామయ్య–డీకే శివకుమార్ భేటీ అయ్యారు. ఈ రోజు ఉదయం జరిగిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అనంతరం ఇద్దరు నేతలు కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల ప్రకారం వివిధ ముఖ్య అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. సిద్ధరామయ్య స్పందిస్తూ— రేపటి నుంచి రాష్ట్రంలో ఎలాంటి గందరగోళం ఉండబోదని చెప్పారు. పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేసే దిశగా తమ నిబద్ధతను తెలిపారు. కాంగ్రెస్లో అందరు నేతలు ఐకమత్యంతో ఉన్నారని, ఆ ఐకమత్యం కొనసాగుతుందని పేర్కొన్నారు. డీకే శివకుమార్ మాట్లాడుతూ— తనకు, సీఎం సిద్ధరామయ్యకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఇద్దరూ కలిసి పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్కు తాము నమ్మకమైన సేవకులమని,…
Read More