పని గంటల వివాదంపై స్పందించిన కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ నిర్మాతలకు లాభాలు తేవడమే నటిగా నా బాధ్యత అని స్పష్టం సీరియల్ షూటింగ్‌లోనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చానని వెల్లడి చిత్ర పరిశ్రమలో పని గంటల చుట్టూ జరుగుతున్న చర్చపై కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నటి స్మృతి ఇరానీ తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించారు. నటిగా తన ప్రథమ కర్తవ్యం నిర్మాతలకు లాభాలు చేకూర్చడమేనని, పని గంటల గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల నటి దీపికా పదుకొణె ఎక్కువ పని గంటల కారణంగా కొన్ని భారీ ప్రాజెక్టుల నుంచి వైదొలిగారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో స్మృతి ఇరానీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడుతూ, “దీపిక విషయం పూర్తిగా ఆమె వ్యక్తిగతమైంది. కానీ…
Read More