పండగ రద్దీని తగ్గించేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తిరుపతి నుంచి షిర్డీ, జల్నాలకు ప్రత్యేక రైలు సర్వీసులు ప్రతి ఆదివారం తిరుపతిలో బయల్దేరనున్న షిర్డీ స్పెషల్ ట్రైన్ దసరా, దీపావళి పండుగల సీజన్ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే (SCR) అనేక ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు, ముఖ్యంగా తిరుమల శ్రీవారి భక్తులకు అనువుగా ఉండేలా పలు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. రద్దీని నియంత్రించేందుకు ఈసారి మొత్తం 470 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. వీటిలో 170 రైళ్లు పూర్తిగా SCR పరిధిలో నడుస్తుండగా, మిగిలినవి ఇతర రైల్వే జోన్‌ల నుంచి ఈ మార్గంలో ప్రయాణిస్తాయి. చెన్నై-షాలిమార్, కన్యాకుమారి-హైదరాబాద్ మార్గాల్లో కూడా ప్రత్యేక…
Read More