ఏపీ డీఎస్సీ ఫలితాల్లో ఉరవకొండ యువకుడికి ఐదు టీచర్ ఉద్యోగాలు చేనేత కార్మికుల కుటుంబానికి చెందిన శ్రీనివాసులు ఘనవిజయం 2018లో కేవలం ఒక్క మార్కు తేడాతో ఉద్యోగాన్ని కోల్పోయిన యువకుడు పట్టుదల ఉంటే పేదరికం గెలుపునకు అడ్డుకాదని నిరూపించాడు ఓ యువకుడు. చేనేత కార్మికుల కుటుంబంలో పుట్టి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ఇటీవల విడుదలైన ఏపీ డీఎస్సీ ఫలితాల్లో ఏకంగా ఐదు టీచర్ ఉద్యోగాలను సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఉరవకొండలోని పదో వార్డు రంగావీధిలో నివసించే రొడ్డ వరలక్ష్మి, ఎర్రిస్వామి దంపతుల కుమారుడు శ్రీనివాసులు ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల కష్టాన్ని చూస్తూ పెరిగిన శ్రీనివాసులు, ఎలాగైనా ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. దూరవిద్యలో డిగ్రీ, ఎస్కే యూనివర్సిటీలో బీఈడీ పూర్తిచేశాడు. అయితే, అతని ప్రయాణం అంత సులువుగా…
Read More