బిల్లుల ఆమోదంపై గవర్నర్లకు కాలపరిమితి అంశం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎదుట వాదనలు పూర్తి కీలక తీర్పును రిజర్వ్ చేసిన సర్వోన్నత న్యాయస్థానం గవర్నర్‌లు, రాష్ట్రపతి బిల్లులను ఆమోదించడానికి గడువు విధించవచ్చా లేదా అనే కీలకమైన రాజ్యాంగ అంశంపై సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు పంపే బిల్లులను గవర్నర్‌లు ఆమోదించడంలో ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఈ అంశంపై 14 ప్రశ్నలతో న్యాయసలహా కోరడంతో, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆగస్టు 19న ప్రారంభమైన విచారణ 10 రోజులకు పైగా సుదీర్ఘంగా కొనసాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపు న్యాయవాదులు తమ వాదనలను ధర్మాసనం ముందు వినిపించారు. కేంద్ర ప్రభుత్వ…
Read More