అక్రమ వలసదారుల నుంచి విద్యార్థులపైకి ట్రంప్ సర్కార్ దృష్టి అమెరికాలో ఓపీటీ విద్యార్థుల ఇళ్లు, హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు ముఖ్యంగా స్టెమ్ ఓపీటీ విద్యార్థులే లక్ష్యంగా అధికారుల సోదాలు అమెరికాలో గతంలో అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరించిన ట్రంప్ ప్రభుత్వం, ఇప్పుడు అంతర్జాతీయ విద్యార్థులపై దృష్టి సారించింది. ముఖ్యంగా, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) ప్రోగ్రామ్ కింద పనిచేస్తున్న విద్యార్థులే లక్ష్యంగా దర్యాప్తు ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు నివసించే ఇళ్లు, హాస్టళ్లకు అధికారులు అకస్మాత్తుగా వెళ్లి తనిఖీలు చేస్తుండటంతో భారతీయ విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. STEM OPT విద్యార్థులే ప్రధాన లక్ష్యం అధికారులు ఇప్పుడు స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) రంగంలో OPT పొడిగింపులో ఉన్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ఆకస్మిక తనిఖీలు చట్టబద్ధమైనవే అయినప్పటికీ, గతంలో ఎన్నడూ లేనంతగా…
Read More