సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని సూచన ప్రజల భద్రత, జంతువుల హక్కుల మధ్య సమతుల్యం అవసరమన్న కోర్టు బాధ్యతగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసిన ధర్మాసనం వీధి కుక్కల సమస్యను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమస్యపై తీసుకున్న చర్యలకు సంబంధించి నివేదికలు దాఖలు చేయకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. రాష్ట్రాల నిర్లక్ష్యం కారణంగా దేశానికి చెడ్డపేరు వస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా వీధి కుక్కల బెడద, వాటి దాడులకు సంబంధించిన అనేక పిటిషన్లను సోమవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ విచారణ సందర్భంగా, చాలా రాష్ట్రాలు ఇప్పటికీ చర్యల నివేదికలను సమర్పించకపోవడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. “వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉంది. ఈ విషయంలో మీరేం చర్యలు తీసుకున్నారో చెప్పడానికి…
Read MoreTag: #StrayDogs
SupremeCourt : ఢిల్లీలో వీధి కుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు
SupremeCourt : ఢిల్లీలో వీధి కుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు:వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టు సంచలనాత్మక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని అన్ని నివాస ప్రాంతాల నుంచి వీధి కుక్కలను వెంటనే పట్టుకుని, ప్రత్యేక షెల్టర్లకు తరలించాలని సోమవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టు సంచలనాత్మక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని అన్ని నివాస ప్రాంతాల నుంచి వీధి కుక్కలను వెంటనే పట్టుకుని, ప్రత్యేక షెల్టర్లకు తరలించాలని సోమవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలకు ఎవరైనా అడ్డుతగిలితే వారిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని ధర్మాసనం తీవ్రంగా హెచ్చరించింది. రోజురోజుకూ పెరుగుతున్న కుక్కకాటు ఘటనలు, రేబిస్ మరణాలపై వచ్చిన వార్తలను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. జస్టిస్ జేబీ పార్థీవాలా,…
Read More