పెద్దప్రేగు క్యాన్సర్ వ్యాప్తికి చక్కెర పానీయాలు కారణం అమెరికా పరిశోధకుల అధ్యయనంలో సంచలన విషయాల వెల్లడి గ్లూకోజ్-ఫ్రక్టోజ్ మిశ్రమంతో క్యాన్సర్ కణాల వేగవంతమైన వ్యాప్తి కొలొరెక్టల్ క్యాన్సర్ రోగులు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. ఇటీవల అమెరికా పరిశోధకులు జరిపిన ఒక అధ్యయనంలో, మనం సాధారణంగా తాగే చక్కెర పానీయాలు, పండ్ల రసాలు (జ్యూసులు) పెద్దపేగు క్యాన్సర్ చివరి దశలో ఉన్నప్పుడు శరీరంలో మరింత వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమవుతున్నాయని తేలింది. అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన ఎండీ ఆండర్సన్ క్యాన్సర్ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. చక్కెర పానీయాలలో ఎక్కువగా ఉండే గ్లూకోజ్-ఫ్రక్టోజ్ మిశ్రమం క్యాన్సర్ కణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో లోతుగా అధ్యయనం చేశారు. కేవలం గ్లూకోజ్ లేదా ఫ్రక్టోజ్ విడివిడిగా కాకుండా, ఈ రెండింటి…
Read More