అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనల్లో కీలక ముందడుగు ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో సంపూర్ణ విజయం శరీర కణాలతోనే రోగనిరోధక శక్తిని పెంచే ఫార్ములా క్యాన్సర్ మహమ్మారిని జయించే దిశగా వైద్య రంగంలో ఒక కీలక ముందడుగు పడింది. క్యాన్సర్ సోకకముందే దానిని నిరోధించే ఒక ‘సూపర్ వ్యాక్సిన్’ను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మసాచుసెట్స్ అమ్హెర్స్ట్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించిన ఈ టీకా ప్రయోగశాలలో ఎలుకలపై అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తుంది. క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉన్న అసాధారణ కణాలను గుర్తించి, అవి కణితులుగా (ట్యూమర్లుగా) మారకముందే నాశనం చేసేలా రోగనిరోధక శక్తిని ప్రేరేపిస్తుంది. ఈ వ్యాక్సిన్‌ను శరీరంలోని కణాలతో పాటు, రోగనిరోధక ప్రతిస్పందనను బలంగా పెంచే ఒక ప్రత్యేక ఫార్ములా (‘సూపర్ అడ్జువెంట్’)తో తయారు…
Read More