పారిశుద్ధ్య కార్మికులే నిజమైన దేశభక్తులని కొనియాడిన సీఎం చంద్రబాబు విజయవాడలో స్వచ్ఛాంధ్ర అవార్డులను ప్రదానం చేసిన ముఖ్యమంత్రి జనవరి 1 నాటికి రాష్ట్రాన్ని జీరో వేస్ట్ గమ్యానికి చేర్చడమే లక్ష్యం పారిశుద్ధ్య కార్మికులే నిజమైన దేశభక్తులని, వారిని చూస్తుంటే ఆపరేషన్ సిందూర్ వీరులు గుర్తుకొస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కొనియాడారు. రాష్ట్ర పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి ఆయన సెల్యూట్ చేశారు. స్వచ్ఛాంధ్ర ద్వారానే స్వర్ణాంధ్ర కల సాకారమవుతుందని, ఈ లక్ష్యం సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం, ఉత్తమ ప్రతిభ కనబరిచిన సంస్థలు, వ్యక్తులకు 21 కేటగిరీల్లో రాష్ట్ర, జిల్లా స్థాయి అవార్డులను అందించారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు దేవుడితో…
Read More