తనకు పదవులపై ఆశలేదన్న రాందేవ్ మోదీ సేవానిరతిని ఆదర్శంగా తీసుకోవాలని సలహా స్వదేశీ వస్తువులనే వాడాలంటూ ప్రజలకు పిలుపు అమెజాన్, యాపిల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు యోగా గురు బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశం వచ్చినా, పదవులపై ఆసక్తి లేకపోవడంతో దానిని సున్నితంగా తిరస్కరించానని వెల్లడించారు. దేశానికి సేవ చేయడమే తన ఏకైక లక్ష్యమని, అధికారం, కీర్తి ప్రతిష్ఠలపై తనకు ఏమాత్రం వ్యామోహం లేదని స్పష్టం చేశారు. రిపబ్లిక్ మీడియా నెట్‌వర్క్ నిర్వహించిన ‘రాష్ట్ర సర్వోపరి సమ్మేళన్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. “నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేశారు. నా వాళ్లను రాజ్యసభకు పంపమని, సొంతంగా పార్టీ పెట్టమని కూడా చాలామంది అడిగారు. కానీ నాకు అధికారంపై ఆశ లేదు. నా…
Read More