ఆర్బీఐ రెపో రేటు మార్చకపోయినా వడ్డీ రేట్లు తగ్గిస్తున్న బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐఓబీ, ఐడీబీఐ నుంచి వినియోగదారులకు ఊరట బ్యాంక్ ఆఫ్ బరోడాలో 15 బేసిస్ పాయింట్ల వరకు రుణ రేట్ల కోత ఆర్‌బీఐ రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయనప్పటికీ, మూడు ప్రముఖ బ్యాంకులు తమ వినియోగదారులకు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ బ్యాంకులు తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (ఎంసీఎల్ఆర్) సవరించడంతో, వాటితో అనుసంధానమైన గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఈ నిర్ణయంతో ఫ్లోటింగ్ వడ్డీ రేటుపై రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐ భారం తగ్గే అవకాశం ఉంది. బ్యాంకులు తగ్గించిన వడ్డీ రేట్ల…
Read More