46 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపైకి రానున్న రజనీకాంత్-కమల్ హాసన్ కాంబో దుబాయ్‌లో జరిగిన సైమా వేడుకలో ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించిన కమల్ రజనీతో ఎలాంటి విభేదాలు లేవనీ, త్వరలోనే చేతులు కలుపుతామని వెల్లడి దక్షిణ భారత సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా అభిమానులు ఎదురుచూస్తున్న కల నిజం కాబోతోంది. ఇద్దరు మహానటులు, సినీ దిగ్గజాలు రజనీకాంత్, కమల్ హాసన్ మళ్లీ కలిసి ఒకే తెరపై కనిపించనున్నారు. దాదాపు 46 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించబోతున్నారని కమల్ హాసన్ స్వయంగా అధికారికంగా ప్రకటించారు. దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డుల వేడుకలో ఆయన ఈ సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ, “ఇన్నాళ్లూ ప్రజలే మా మధ్య పోటీని సృష్టించారు. కానీ, నా మిత్రుడు రజనీకాంత్‌తో నాకు ఎలాంటి విభేదాలు…
Read More