BengaluruTraffic : ట్రాఫిక్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బెంగళూరుకు విముక్తి! 40% రద్దీని తగ్గించే చారిత్రక ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.

Bengaluru Business Corridor Approved: Karnataka Govt. Greenlights $1.2 Billion Peripheral Ring Road Project.

‘బెంగళూరు బిజినెస్ కారిడార్’కు కర్ణాటక కేబినెట్ ఆమోదం రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం.. రూ.10 వేల కోట్ల అంచనా వ్యయం భూనిర్వాసితులకు ఐదు ఆప్షన్లతో కొత్త పరిహారం ప్యాకేజీ టెక్ సిటీ బెంగళూరులో దీర్ఘకాలంగా నెలకొన్న తీవ్ర ట్రాఫిక్ రద్దీకి పరిష్కారంగా కర్ణాటక ప్రభుత్వం ఒక నిర్ణయాత్మక ముందడుగు వేసింది. ఇంతకుముందు పెండింగ్‌లో ఉన్న 117 కిలోమీటర్ల పెరిఫెరల్ రింగ్ రోడ్ (PRR) ప్రాజెక్ట్‌ను ఇప్పుడు బెంగళూరు బిజినెస్ కారిడార్’ గా నామకరణం చేసి రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. దాదాపు రూ.10,000 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ కారిడార్‌ను రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ ప్రాజెక్టును “చారిత్రక నిర్ణయం”గా అభివర్ణించారు. ఇది పూర్తయితే నగరంలో ట్రాఫిక్ రద్దీ 40 శాతం మేర తగ్గుతుందని అంచనా. హైవేలు, పారిశ్రామిక ప్రాంతాల…

Read More