యూపీ పంచాయతీ ఓటర్ల జాబితా సవరణలో బయటపడ్డ భారీ లోపం మహోబా జిల్లా జైత్పూర్ మొత్తం ఓటర్లలో నాలుగో వంతు మందికి ఒకే చిరునామా సాంకేతిక తప్పిదమేనని, ఓటర్లు నిజమైనవారేనంటున్న అధికారులు 2026లో ఉత్తరప్రదేశ్లో జరగనున్న పంచాయతీ ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్న ఓటర్ల జాబితాలో ఒక వింత సంఘటన బయటపడింది. మహోబా జిల్లాలోని జైత్పూర్ గ్రామ పంచాయతీలో ఒకే ఇంటి నంబర్ (803)పై ఏకంగా 4,271 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. ఈ పంచాయతీలో మొత్తం ఓటర్ల సంఖ్య 16,069 కాగా, నాలుగో వంతు ఓటర్లు ఒకే చిరునామాపై ఉండటం అధికారులను, స్థానికులను ఆశ్చర్యపరిచింది. ఇంటింటి సర్వే చేపట్టిన బూత్ స్థాయి అధికారులు ఈ విషయాన్ని గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై సహాయ జిల్లా ఎన్నికల అధికారి ఆర్పీ విశ్వకర్మ మాట్లాడుతూ, ఇది…
Read More