ఈ టోర్నమెంట్ యువ క్రీడాకారుల ప్రతిభకు వేదికయ్యింది – తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కాసాని వీరేష్ ముదిరాజ్ హైదరాబాద్ : హైదరాబాద్ ఎల్బీ ఇండోర్ స్టేడియంలో బుధవారం యువ తెలంగాణ ఛాంపియన్‌షిప్ 2025 ఘనంగా ముగిసింది. ఫైనల్లో జోగులాంబ లయన్స్ అద్భుత ప్రతిభను ప్రదర్శించి, భద్రాద్రి బ్రేవ్స్‌ను 35-21 తేడాతో ఓడించి విజేతలుగా నిలిచాయి. సూఠపర్ 4 దశలో ఉత్కం పోరు ఫైనల్‌కు ముందు సూపర్ 4 దశలో జరిగిన చివరి రెండు మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగాయి. మొదటి మ్యాచ్: యాదాద్రి యోధులు, బసర విద్యుత్‌పై 66-45 తేడాతో గెలిచారు. రైడింగ్, డిఫెన్స్ రెండింటిలోనూ ఆధిపత్యం చాటిన యోధులు, ఫైనల్‌కు చేరుకోకపోయినా తమ ప్రయాణాన్ని విజయవంతంగా ముగించారు. మరోవైపు వరుస పరాజయాలతో విద్యుత్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాయి. చివరి మ్యాచ్: భద్రాద్రి బ్రేవ్స్, జోగులాంబ లయన్స్‌పై 45-44…
Read More