నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురు వ్యక్తులు మూడు రోజులు గడుస్తున్నా వెలికితీయకపోవడంపై ఆగ్రహం ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనలో మృతదేహాలను ఇప్పటికీ గుర్తించలేదని విమర్శ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్లో భారీ వర్షాల కారణంగా నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురి మృతదేహాలు మూడు రోజులు గడిచినా వెలికితీయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలిన ఘటనలో ఆరుగురి మృతదేహాలు ఇప్పటికీ గుర్తించలేకపోవడం కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. కనీసం బాధిత కుటుంబాలకు చివరి చూపు కూడా కల్పించలేని పరిస్థితి మానవత్వం లేని పాలనకు ఉదాహరణ అని ఎద్దేవా చేశారు. నాలాల్లో బలి అయిన ముగ్గురి మృతదేహాలను కూడా ప్రభుత్వం గుర్తించకపోతే, బీఆర్ఎస్ నిశ్శబ్దంగా ఉండదని కేటీఆర్ హెచ్చరించారు. Read : AP : మెగా…
Read More