దక్షిణాదిలో ఈ ఘనత సాధించిన మూడో రాజకీయ నేతగా గుర్తింపు ఉమ్మడి ఏపీ, నవ్యాంధ్ర సీఎంగా సుదీర్ఘకాలం పనిచేసిన రికార్డు సంక్షోభాలను ఎదుర్కొని, సంస్కరణలతో పాలన సాగించిన నేతగా పేరు తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రస్థానంలో మరో మైలురాయిని చేరుకున్నారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన, ముఖ్యమంత్రిగా నేటితో (అక్టోబరు 10) 15 సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన నేతల జాబితాలో దక్షిణాది నుంచి ఈ ఘనత సాధించిన మూడో వ్యక్తిగా ఆయన నిలిచారు. ఇంతకుముందు తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి, పుదుచ్చేరి సీఎం ఎన్. రంగస్వామి మాత్రమే ఈ రికార్డును సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత (8 సంవత్సరాల…
Read More