సిడ్నీ ఉగ్రదాడి వెనుక హైదరాబాద్ వ్యక్తి? ఆస్ట్రేలియా పోలీసుల కీలక వెల్లడి Sajid Akram : ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరాన్ని వణికించిన సామూహిక కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడికి హైదరాబాద్ మూలాలు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఆదివారం బాండీ బీచ్లో యూదుల హనుక్కా వేడుకల సందర్భంగా జరిగిన ఈ దాడిలో 15 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటనకు పాల్పడిన ఇద్దరిలో ఒకడైన సాజిద్ అక్రమ్ (50) హైదరాబాద్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. దాడి సమయంలో పోలీసుల కాల్పుల్లో సాజిద్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో కలిసి దాడిలో పాల్గొన్న అతని కుమారుడు నవీద్ అక్రమ్ (24) గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనను ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ప్రేరేపిత ఉగ్రదాడిగా ఆస్ట్రేలియా అధికారులు ప్రకటించారు. తెలంగాణ డీజీపీ వెల్లడించిన…
Read More