Samantha : నిర్మాతగా కొత్త అవతారం… సమంత కొత్త ఇల్లు సరికొత్త విజయాలకు నాంది!

Samantha Shares Glimpses of Her New House & Inspiring Life Philosophy.

కొత్త ఇంట్లో గృహప్రవేశం చేసిన నటి సమంత ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేక పూజలు సోషల్ మీడియాలో ఫొటోలను పంచుకున్న సామ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. అనారోగ్యం నుంచి కోలుకుని కెరీర్‌లో దూసుకెళ్తున్న ఆమె, తాజాగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సంప్రదాయబద్ధంగా గృహప్రవేశ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆమె తన అభిమానులతో పంచుకోగా, అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుక కోసం సమంత ఎరుపు రంగు సంప్రదాయ వస్త్రాలు ధరించి ప్రత్యేక పూజలు చేశారు. పూజలో ఎంతో ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో పాల్గొన్న ఆమె ఫొటోలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. నుదుట కుంకుమతో ఉన్న ఆమె లుక్ ఆన్‌లైన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘ఫొటో డంప్’ అనే శీర్షికతో ఆమె…

Read More