Europe : సైబర్ దాడితో అస్తవ్యస్తమైన విమానయాన సేవలు: యూరప్‌లోని విమానాశ్రయాలపై భారీ దాడి

Cyberattack Disrupts Air Travel: Major Attack on European Airports

లండన్ హీత్రో, బ్రసెల్స్, బెర్లిన్ ఎయిర్‌పోర్టులలో నిలిచిన సేవలు చెక్-ఇన్, బోర్డింగ్ వ్యవస్థలు పనిచేయకపోవడంతో విమానాలు ఆలస్యం ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వేలాది మంది ప్రయాణికులు యూరప్‌లోని పలు కీలక విమానాశ్రయాలపై జరిగిన భారీ సైబర్ దాడితో విమానయాన సేవలు అస్తవ్యస్తంగా మారాయి. లండన్ హీత్రో, బ్రసెల్స్, బెర్లిన్ వంటి ప్రధాన విమానాశ్రయాలు ఈ దాడి ప్రభావానికి గురవడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కీలకమైన ఆన్‌లైన్ వ్యవస్థలు కుప్పకూలడంతో అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా, మరికొన్నింటిని రద్దు చేశారు. సైబర్ నేరగాళ్లు విమానాశ్రయాల సర్వీస్ ప్రొవైడర్లను లక్ష్యంగా చేసుకోవడంతో చెక్-ఇన్, బోర్డింగ్ వంటి ముఖ్యమైన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా, బ్రసెల్స్ విమానాశ్రయంలో ఆటోమేటెడ్ చెక్-ఇన్, బోర్డింగ్ సిస్టమ్‌లు పూర్తిగా పనిచేయడం లేదని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు…

Read More