Hyderabad : భూగర్భంలోకి విద్యుత్ తీగలు: హైదరాబాద్‌లో రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్ట్

TGSPDCL to Modernise Power Grid with Underground Cabling in Greater Hyderabad

గ్రేటర్ హైదరాబాద్‌లో ఓవర్‌హెడ్ విద్యుత్ తీగల తొలగింపునకు ప్రణాళిక బెంగళూరు మాదిరిగా భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయం మొత్తం 25,000 కిలోమీటర్ల లైన్ల మార్పునకు ప్రతిపాదనలు సిద్ధం గ్రేటర్ హైదరాబాద్ వాసులకు త్వరలో వేలాడే విద్యుత్ తీగల సమస్య తీరనుంది. నగరమంతటా సురక్షితమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం భూగర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. బెంగళూరు నగరంలో విజయవంతంగా అమలు చేస్తున్న ఈ విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని, హైదరాబాద్‌లోనూ దీనిని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కింద గ్రేటర్ పరిధిలోని సుమారు 25,000 కిలోమీటర్ల పొడవైన ఓవర్‌హెడ్ విద్యుత్ లైన్లను దశలవారీగా భూగర్భంలోకి మార్చనున్నారు. ఇందులో 21,643 కిలోమీటర్ల 11 కేవీ లైన్లు, 3,725…

Read More