Varun Lavanya : వరుణ్ తేజ్-లావణ్యలకు ఆడబిడ్డ! మెగా కుటుంబంలో ఆనందం

Varun Tej and Lavanya Tripathi Welcome a Baby Girl

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులయ్యారు: చిరంజీవి సంతోషం కొణిదెల కుటుంబంలోకి కొత్త సభ్యురాలు: వరుణ్-లావణ్యల ఇంటికి మహాలక్ష్మి ఆడబిడ్డకు జన్మనిచ్చిన లావణ్య: హాస్పిటల్‌లో వరుణ్ తేజ్, చిరంజీవి మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ప్రముఖ నటుడు వరుణ్ తేజ్, ఆయన సతీమణి, నటి లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులయ్యారు. హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో లావణ్య ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ వార్త తెలియగానే మెగా అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి తన కొత్త చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’ షూటింగ్ నుంచి నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ వరుణ్ తేజ్, లావణ్యలను కలిసి తన అభినందనలు, ఆశీస్సులు అందజేశారు. కుటుంబంలోకి కొత్త సభ్యురాలి రాక పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేసినట్లు సమాచారం.…

Read More