సమంత – రాజ్ నిడిమోరు పెళ్లి Samantha marries Director Raj Nidimoru : టాలీవుడ్ అగ్ర నటి సమంత రూత్ ప్రబు తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె వివాహం కోయంబత్తూరులో జరగినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈశా ఆధ్యాత్మిక కేంద్రం యోగా సెంటర్‌లో అత్యంత సన్నిహితులకు మాత్రమే పరిమితమైన సింపుల్ వేడుకలో ఈ జంట మంగళ్య ధారణ చేసినట్లు తెలుస్తోంది.ఈ రోజు సాయంత్రం ఇద్దరూ తమ వివాహాన్ని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించే అవకాశముందని కూడా సమాచారం. గత కొన్ని నెలలుగా సమంత – రాజ్ నిడిమోరు ప్రేమలో ఉన్నారనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశం. అమెజాన్ ప్రైమ్ కోసం రాజ్–డీకే రచన, దర్శకత్వంలో రూపొందిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’,…
Read MoreTag: #ViralNews
IT Jobs : కేవలం 4 నిమిషాల ఆన్‌లైన్ మీటింగ్‌తో ఉద్యోగులను తొలగించిన అమెరికన్ కంపెనీ: రెడిట్‌లో పోస్ట్ వైరల్!
నాలుగే నిమిషాల ఆన్‌లైన్ మీటింగ్‌లో ఉద్యోగుల తొలగింపు అమెరికా కంపెనీలో పనిచేస్తున్న భారత టెకీకి చేదు అనుభవం కెమెరా, మైక్ ఆపేసి ప్రకటన చేసిన కంపెనీ సీఓఓ టెక్ ప్రపంచంలో లేఆఫ్‌లు సర్వసాధారణంగా మారాయి. అయితే, కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగించే తీరు తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోంది. తాజాగా, అమెరికాకు చెందిన ఒక కంపెనీ తన భారతీయ ఉద్యోగులను కేవలం నాలుగు నిమిషాల ఆన్‌లైన్ మీటింగ్‌తో తొలగించడం సంచలనం రేకెత్తించింది. ఈ దారుణ అనుభవాన్ని ఎదుర్కొన్న ఒక ఉద్యోగి రెడిట్ (Reddit) ప్లాట్‌ఫామ్‌లో పంచుకున్న పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. షాకింగ్ తొలగింపు కథనం: బాధిత ఉద్యోగి కథనం ప్రకారం.. ఉదయం 11 గంటలకు కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO)తో తప్పనిసరిగా హాజరు కావాల్సిన మీటింగ్‌కి క్యాలెండర్ ఇన్వైట్ వచ్చింది. మీటింగ్ ప్రారంభం కాగానే,…
Read MoreAmeesha : అందరూ నా శరీరాన్నే చూశారు-పెళ్లిపై అమీషా పటేల్ ఎమోషనల్ కామెంట్స్.
తన పెళ్లిపై స్పందించిన నటి అమీషా పటేల్ తాను డేటింగ్ చేసిన వారిలో నిజాయతీ లోపించిందని వెల్లడి తెలుగు ప్రేక్షకులకు ‘బద్రి‘ మరియు ‘నాని’ చిత్రాల ద్వారా సుపరిచితురాలైన సీనియర్ బాలీవుడ్ నటి అమీషా పటేల్, 50 ఏళ్ల వయసులో కూడా తాను ఒంటరిగా ఉండటానికి గల కారణాలపై సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఆమె పంచుకున్నారు. తాను ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను ఆమె మొదటిసారిగా స్పష్టంగా వివరించారు. పెళ్లి చేసుకోకపోవడానికి కారణాలు గతంలో తాను చాలా మందితో డేటింగ్ చేశానని, అయితే వారిలో ఎవరి దగ్గరా నిజాయితీ కనిపించలేదని అమీషా పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. “నా జీవితంలో చాలా మందితో ప్రేమాయణం నడిపాను. కానీ ఎవరూ నన్ను మనస్ఫూర్తిగా అర్థం…
Read MoreTejaSajja : తేజ సజ్జ ‘మిరాయ్’లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పెషల్ అప్పీరియన్స్?
తేజ సజ్జ ‘మిరాయ్’ చిత్రానికి తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సినిమాలో ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించారంటూ జోరుగా ప్రచారం శ్రీరాముడి గెటప్‌లో ప్రభాస్ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ యంగ్ హీరో తేజ సజ్జ నటించిన తాజా చిత్రం ‘మిరాయ్’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘హనుమాన్’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత తేజ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే, ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించారని! ‘మిరాయ్’ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించారని చెబుతూ…
Read More