తిరుపతిలో ఆటోలు నడుపుతూ ఉపాధి పొందుతున్న మహిళలు కష్టాలను ఎదుర్కొని స్వయం ఉపాధితో ఆదర్శంగా నిలుస్తున్న వైనం రాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో డ్రైవింగ్‌లో ప్రత్యేక శిక్షణ కలియుగ దైవం కొలువై ఉన్న తిరుపతిలో ఇప్పుడు కొత్త స్ఫూర్తి పవనాలు వీస్తున్నాయి. జీవితంలో ఎదురైన కష్టాలకు కుంగిపోకుండా, కొందరు మహిళలు ఆటో స్టీరింగ్‌ను పట్టి తమ జీవితాలకు కొత్త దారి వేసుకుంటున్నారు. మగవారికి మాత్రమే పరిమితం అనుకున్న రంగంలోకి అడుగుపెట్టి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. కష్టాల నుంచి వచ్చిన ఆలోచన కొందరు మహిళల జీవితాలు అనూహ్యమైన కష్టాలతో సతమతమయ్యాయి. భర్త చనిపోవడం, ఉన్న ఉద్యోగం కోల్పోవడం వంటి సంఘటనలు వారిని ఆర్థికంగా, మానసికంగా కుంగదీశాయి. ఏం చేయాలో తెలియని స్థితిలో వారికి రాస్ అనే స్థానిక స్వచ్ఛంద సంస్థ ఒక ఆశాకిరణంలా కనిపించింది.…
Read More