Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఏపీలో దంచికొడుతున్న వానలు

0

విశాఖపట్టణం, డిసెంబర్ 4, 

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సోమవారం ఉదయానికి తుఫానుగా మారనుంది. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వచ్చే 4 రోజులపాటు వర్షాలు ముమ్మరంగా కురిసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీంతో సోమ, మంగళవారాల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. తుపాను తీరం దాటే సమయంలో గాలి ఉద్ధృతంగా వీస్తుందని హెచ్చరించారు. గంటకు 95 నుంచి 105 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

మరోవైపు అన్ని శాఖల సిబ్బంది, సచివాలయ సిబ్బంది జిల్లా ప్రజలకు అందుబాటులో వుండాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ సూచించారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికార యంత్రాంగాన్ని ఆయన అలర్ట్ చేశారు.’మైచౌంగ్’ తుఫానుగా నామకరణం చేశారు. తుఫాను ఈ నెల 4న నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీంతో అధికారులంతా సన్నద్ధంగా వుండాలని, సహాయక చర్యల్లో ఎలాంటి లోటూ రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కరెంట్, రవాణా వ్యవస్థలకు అంతరాయం ఏర్పడితే వాటిని వెంటనే పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ సూచించారు. తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి, అందులో తాగునీరు, ఆహారం, పాలు వంటివి అందుబాటులో వుంచుకోవాలని సూచించారు.

అలాగే వైద్య సేవలను కూడా అందజేపయాలని తెలిపారు.అటు మైచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో రైల్వే శాఖ పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 140కి పైగా రైళ్లను డిసెంబర్ 3 నుంచి 6 వ తేదీ వరకు రద్దు చేసినట్లు సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. మరికొన్నింటినీ పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. రహదారులన్నీ జలమయం అయ్యాయి. నెల్లూరు జిల్లా మైపాడు బీచ్‌లో అలలు ఎగసిపడుతున్నాయి.
5న తీరాన్ని దాటే అవకాశం వాయుగుండం తుపానుగా మారి విజృంభించబోతోంది.

ఈ తుపానుకు ‘మిచౌంగ్‌’ గా నామకరణం చేశారు. ఈ మిచౌంగ్ తుపాను ఈ నెల 5న మచిలీపట్నం, నెల్లూరు మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం బంగాళాఖాతంలోని వాయుగుండం.. నెల్లూరు, మచిలీపట్నానికి వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ నెల 5న నెల్లూరు- మచిలీపట్నం మధ్య 90 కిలోమీటర్ల వేగంతో తుపాను తీరం దాటనుంది. దాంతో.. వచ్చే మూడు, నాలుగు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ముఖ్యంగా.. ఏపీకి మిచౌంగ్‌ తుపాను ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే.. కోస్తాంధ్ర వైపు తుపాను దూసుకొస్తోంది. దాంతో.. కోస్తాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రకాశం, నెల్లూరు, తిరుపతిలోనూ తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. అన్ని జిల్లాల్లోనూ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు అధికారులు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. అటు.. మిచౌంగ్ తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్‌లో ఒకటో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie