వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. 14 బోగీల్లో…10 బోగీలు ఖాళీ విశాఖపట్టణం, నవంబర్ 26, (న్యూస్ పల్స్) Vande Bharat Express వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. చాలా రూట్లలో బాగా డిమాండ్ ఉంది. కానీ.. విశాఖపట్నం- దుర్గ్ మధ్య నడిచే ట్రైన్‌కు డిమాండ్ నామమాత్రంగా కూడా లేదు. దీంతో ఈ రైలు నిత్యం ఖాళీగా దర్శనమిస్తోంది. దీంతో డిమాండ్ లేని రూట్‌లో ఎందుకు.. వేరే మార్గంలో నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.చాలావరకు వందేభారత్ రైళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. టికెట్లు లభించడం కష్టంగా ఉంది. కానీ.. విశాఖపట్నం- దుర్గ్ మధ్య ప్రవేశపెట్టిన వందేభారత్ పరిస్థితి దారుణంగా. ప్రయాణికుల నుంచి ఆదరణ లభించడం లేదు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్, భువనేశ్వర్‌కు వెళ్తున్న వందేభారత్ రైళ్లకు భారీగా డిమాండ్ ఉంటోంది. విశాఖపట్నం- దుర్గ్ వందేభారత్‌లో మాత్రం బోగీలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ ట్రైన్‌లో మొత్తం 14…
Read MoreTag: Visakhapatnam
Taramandal Technologies in AP | ఫోర్బ్స్ జాబితా చేసిన AP ఆధారిత స్టార్టప్ తారామండల్ టెక్నాలజీస్ | Eeroju news
ఫోర్బ్స్ జాబితా చేసిన AP ఆధారిత స్టార్టప్ తారామండల్ టెక్నాలజీస్ లోకల్ టూ గ్లోబల్ అంటున్న విశాఖ కుర్రాళ్లు… విశాఖపట్టణం, నవంబర్ 25, (న్యూస్ పల్స్) Taramandal Technologies in AP విశాఖకు చెందిన తారమండల్ టెక్నాలజీస్ స్పెస్ టెక్ రంగంలో ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తుందని ఫోర్బ్స్ ఇండియా గుర్తించింది. తాజాగా రిలీజ్ చేసిన డి గ్లోబలిస్ట్ లిస్టులో టాప్ 200 స్టార్టప్ జాబితాలో తారమండల్ టెక్నాలజీస్‌కు చోటు కల్పించింది. గ్లోబల్ బిజినెస్ పొటెన్షియల్, ఇన్నోవేషన్, విస్తరణ ప్రణాళికలను గుర్తించి జాబితాలో చోటు కల్పించింది. ఫోర్బ్స్ ఇండియా ఎలైట్ గ్లోబలిస్ట్ జాబితాలో చోటు అంత సామాన్యంగా దక్కదు. కొన్ని వేల స్టార్టప్‌లు తమ ప్రణాళక్ని ఆశయాలను..స్టార్టప్ పురోగతిని వివరిస్తూ నామినేషన్లు పంపిస్తారు. అందులోనుంచి కొన్నింటిని ఎంపిక చేస్తారు. అలా ఫోర్బ్స్ కు వచ్చిన కొన్ని వేల…
Read MorePM Modi | నవంబర్ 29న ఏపీకి మోడీ | Eeroju news
నవంబర్ 29న ఏపీకి మోడీ విశాఖపట్టణం, నవంబర్ 16, (న్యూస్ పల్స్) PM Modi నవంబర్ 29న ఆంధ్రప్రదేశ్ వస్తున్న ప్రధానమంత్రి మోదీ విశాఖ కేంద్రంగా భారీ పెట్టుబడుల పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ పార్క్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌కు 80 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. విశాఖలో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా జరగబోతోందని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌తో పాటు గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ల ఏర్పాటుకు భూమిపూజ చేస్తారని పేర్కొన్నారు. ఈ మూడు ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 1200 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్రాజెక్టుల కారణంగా వచ్చే నాలుగేళ్లలో 48 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.…
Read MoreRushikonda | రుషికొండ మిస్సింగ్ ఫైల్స్ | Eeroju news
రుషికొండ మిస్సింగ్ ఫైల్స్ విశాఖపట్టణం, నవంబర్ 14, (న్యూస్ పల్స్) Rushikonda అద్భుత కట్టడం చుట్టూ అంతులేని చర్చ కొలిక్కి రావడం లేదు. ఎన్నికలకు ముందు ఎన్నికలకు తర్వాత కూడా..ఆ సౌధం చుట్టూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. రుషికొండ భవనాలకు సంబంధించిన ప్రతీ విషయం చర్చనీయాంశం అవుతోంది. అయితే ఇన్నాళ్లుగా ఆ భవనాలను దేని కోసం వాడుతారోనన్న చర్చ జరిగింది. కానీ ఇప్పుడు రుషికొండ నిర్మాణాల ఫైళ్లు, ఫర్నీచర్ లెక్కలు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయట. నిర్మాణ అనుమతుల ఫైళ్లు, కొన్ని కీలక పేపర్లు ఇప్పటికే కనిపించడం లేదంటున్నారు.కొండపై గతంలో ఉన్న రిసార్టును కూలగొట్టేందుకు తీసుకున్న అనుమతుల ఫైళ్లు కూడా గయాబ్ అయినట్లు తెలుస్తోంది. పాత రిసార్టులో 80 గదులతో పాటు ఒక ఫంక్షన్ హాలు, బార్ అండ్ రెస్టారెంట్ ఉండేవి. వాటిల్లో ఉండాల్సిన దాదాపు రూ.50 కోట్ల విలువైన…
Read MoreRushikonda | రుషికొండ భవనాలపై ప్రజల సలహాలు | Eeroju news
రుషికొండ భవనాలపై ప్రజల సలహాలు విశాఖపట్టణం, నవంబర్ 5, (న్యూస్ పల్స్) Rushikonda విశాఖ పర్యటనలో రుషికొండ కట్టడాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు..విలాసాల కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసి ప్యాలెస్ కట్టుకున్నారని మండిపడ్డారు. రాజులు, చక్రవర్తులు కూడా ఇలాంటి భవనాలు నిర్మించుకోలేదన్న ముఖ్యమంత్రి…వందల కోట్ల ప్రజాధనంతో వ్యక్తిగత విలాసాల కోసం కట్టిన ఈ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తున్నామన్నారు. ఈ మేరకు సలహాలు-సూచనలను ఇవ్వాలంటూ ప్రజలకు సూచించారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.500 కోట్లు ఖర్చు చేసి రుషికొండపై ఏడు బ్లాక్‌ల్లో భవనాలు నిర్మించారు. అయితే జగన్ ప్రభుత్వం ఓటమి పాలవడంతో..ఈ భారీ భవనాలు చర్చనీయాంశమయ్యాయి. గత నాలుగు నెలలుగా ఇక్కడి భవనాలు, ఉద్యానవనాల నిర్వహణ, విద్యుత్ వినియోగం కోసం పెద్దమొత్తంలో ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. దీంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుండడంతో.. దీనిపై ఒక నిర్ణయానికి…
Read MoreYCP | వైసీపీ సైలెంట్ ప్లానింగ్…. | Eeroju news
వైసీపీ సైలెంట్ ప్లానింగ్…. విశాఖపట్టణం, నవంబర్ 4, (న్యూస్ పల్స్) YCP మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా నేడు కూటమిపై విమర్శల జోరు సాగిస్తున్నారు. ఎన్నికల ఫలితాల షాక్ నుండి ఇప్పుడిప్పుడే వైసీపీ నేతలు కోలుకుంటున్నారని చెప్పవచ్చు. కేవలం 11 సీట్లకే వైసీపీ పరిమితం కాగా, మాజీ సీఎం జగన్ ఇటీవల నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ పాలన కాలంలో అంతా తానై ముందుండి నడిపించిన సజ్జల రామకృష్ణారెడ్డి కొద్దిరోజులు సైలెంట్ అయ్యారు. ఇటీవల టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి పోలీసుల విచారణకు సజ్జల హాజరయ్యారు.అప్పుడు కనిపించిన సజ్జల, తాజాగా కూటమి ప్రభుత్వం లక్ష్యంగా విమర్శల స్పీడ్ పెంచారని చెప్పవచ్చు. ఆదివారం తిరుపతిలో జరిగిన వైసీపీ కార్యక్రమంలో పాల్గొన్న సజ్జల మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కనిపించడం లేదని,…
Read MoreBotsa Satyanarayana | సత్తిబాబు దూరం అవుతున్నారా.. | Eeroju news
సత్తిబాబు దూరం అవుతున్నారా.. విశాఖపట్టణం, అక్టోబరు 26, (న్యూస్ పల్స్) Botsa Satyanarayana ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. సామాజికపరంగా, ఆర్థికంగా ఆయన బలమైన నేత. ఉత్తరాంధ్రలో ఆయన మోస్ట్ సీనియర్ మాత్రమే కాదు.. ఎన్నో ఉన్నత పదవులు అనుభవించిన బొత్స సత్యనారాయణ వైసీపీ హైకమాండ్ పట్ల అసంతృప్తిగా ఉన్నారా? జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనకు రుచించడం లేదా? అన్న ప్రశ్నకు నిన్నటి జగన్ విజయనగరం జిల్లా పర్యటన స్పష‌్టం చేస్తుంది. ఎందుకంటే తన సొంత జిల్లాకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వస్తే బొత్స సత్యనారాయణ మాత్రం హాజరు కాలేదు. ఎక్కడా ఆయన టూర్ లో కనిపించలేదు. గొర్ల గ్రామంలో పర్యటించిన జగన్ డయేరియా బాధితులను పరామర్శించారు. మృతి చెందిన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అయితే తన సొంత జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు కనీసం…
Read MoreSarada Peetham | శారదా పీఠం..అక్రమాల పుట్ట | Eeroju news
శారదా పీఠం..అక్రమాల పుట్ట విశాఖపట్టణం, అక్టోబరు 26, (న్యూస్ పల్స్) Sarada Peetham శారదాపీఠం.. పేరుకే పీఠం కానీ వివాదాల పుట్ట అనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే పీఠం చెప్పేదొకటి, తీరా చేసేది ఇంకొకటి. ఒక్కో ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కో రకంగా ఉంటూ వత్తాసు పలకడం, సర్కారు కేటాయించిన భూములను వాణిజ్యపరంగా వాడుకోవడం పరిపాటిగా వస్తోంది. కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైసీపీ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడిగిందే తడవుగా, అది ఏదైనా సరే ఇష్టానుసారం ఇచ్చేశారని ఆరోపణలు కోకొల్లలు. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత శారదాపీఠానికి వరుస షాక్‌లు ఇస్తోంది. అటు విశాఖపట్నంలో, ఇటు తిరుమలలో కేటాయించిన భూములును రద్దు చేస్తూ సర్కారు కీలక నిర్ణయాలు తీసుకున్నది. వివాదాస్పద పీఠాధిపతి స్వరూపానందేంద్రకు చెందిన శారదాపీఠానికి ఈ…
Read MoreRushikonda Palace | రుషికొండ కరెంట్ కోసమే.. ఆస్తులు అమ్ముకోవాలా… | Eeroju news
రుషికొండ కరెంట్ కోసమే.. ఆస్తులు అమ్ముకోవాలా… విశాఖపట్టణం, అక్టోబరు 22, (న్యూస్ పల్స్) Rushikonda Palace విశాఖపట్నం సమీపంలోని రుషికొండపై గత ప్రభుత్వం అద్భుతమైన భవనాలను నిర్మించింది. ఎన్నికల కోడ్ వచ్చే వరకు అక్కడ పనులు జరిగాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం మారింది. దీంతో అప్పటినుంచి అక్కడ పెండిగ్ పనులు జరగడం లేదు. కానీ.. కరెంట్ బిల్లు మాత్రం లక్షల్లో వస్తోంది.గత ప్రభుత్వం విశాఖ సమీపంలోని రుషికొండపై రూ.500 కోట్లతో భవనాలను నిర్మించింది. అయితే.. ప్రస్తుతం ఆ భవనాలు ఖాళీగా ఉంటున్నాయి. ఏ కార్యక్రమాల కోసం వాటిని వినియోగించడం లేదు. కొత్తగా నిర్మించిన ఐదు భవనాలు పర్యాటక అవసరాలకు ఉపయోగపడవని కూటమి నేతలు చెబుతున్నారు. కన్వెన్షన్ సెంటర్‌గా మార్చుకునే పరిస్థితి కూడా లేదని అంటున్నారు. ప్రభుత్వ కార్యకలాపాల కోసం వాడుకుందాం అనుకున్నా.. చాలా భారమవుతుందని చెబుతున్నారు.…
Read MoreSarada Peetham | శారద పీఠానికి షాక్… | Eeroju news
శారద పీఠానికి షాక్… హైదరాబాద్ కు మకాం మార్చేసిన స్వరూపనంద విశాఖపట్టణం, అక్టోబరు 21, (న్యూస్ పల్స్) Sarada Peetham విశాఖ శారదా పీఠానికి కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వైసిపి ప్రభుత్వం కేటాయించిన స్థల అనుమతిని రద్దు చేసింది. చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని టీటీడీని ఆదేశించింది. దీంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. వైసిపి హయాంలో శారదా పీఠం కళకళలాడింది. పీఠాధిపతి స్వామి స్వరూపానంద కు ఎనలేని ప్రాధాన్యత లభించేది. ఆయన సిఫారసులకు జగన్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చేది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే స్వరూపానంద చేసిన యాగాలతోనే జగన్ కు అధికారం దక్కిందన్నది అప్పట్లో జరిగిన ప్రచారం. దీంతో వైసీపీ నేతల తాకిడి పీఠానికి పెరిగింది. ఏటా జరిగే పీఠం వార్షికోత్సవాలకు, పర్వదినాలకు విశాఖ శారదా పీఠానికి…
Read More