Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కడప నుంచి బరిలో షర్మిల

0

కడప, మార్చి 19 (న్యూస్ పల్స్)
కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల  పోటీ చేయనున్నారు. షర్మిలను కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ నాయకత్వం సూచించినట్లు తెలుస్తోంది. పార్టీ సూచిస్తే ఎన్నికల్లొ పోటీ చేస్తానని షర్మిల చెబుతూ వచ్చారు. ఇప్పుడు పార్టీ నాయకత్వం ప్రధానంగా ఎంపీ స్థానాల పైనే ఫోకస్ చేస్తోంది. అయితే, పార్టీ సూచన పైన షర్మిల తుది నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది.  ఎన్నికల బరిలో షర్మిల కడప ఎంపీగా వివేకా సతీమణి సౌభాగ్యమ్మను బరిలోకి దింపాలని టీడీపీ ఆలోచన చేస్తున్నట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే, సౌభాగ్యమ్మను కాంగ్రెస్ నుంచే పోటీ చేయించాలనే మరో ఆలోచన తాజాగా జరిగిన వివేకా సంస్మరణ సభలో ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం షర్మిలను కడప ఎంపీగా బరిలోకి దిగాలని సూచిస్తుండటంతో…వివేకా కుటుంబం నుంచి పోటీ ఉండదనే అంచనా వ్యక్తం అవుతోంది. వైసీపీ నుంచి వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలిచిన అవినాశ్ రెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు. వివేకా కుమార్తె సునీత తన తండ్రి హత్య కేసులో అవినాశ్ పైన పలు ఆరోపణలు చేసింది. వైసీపీకి ఓటు వేయద్దంటూ తాజాగా తన తండ్రి సంస్మరణ సభలో పిలుపునిచ్చింది. మాజీ సీఎం చెవిలో బాంబు పేల్చిన హోం మంత్రి అమిత్ షా, హీరో విషయంలో జాగ్రతగా చూసుకోండి! షర్మిల నిర్ణయంపై ఉత్కంఠ ఇప్పుడు షర్మిల ఎంపీగా పోటీ చేయాలంటూ హైకమాండ్ సూచిస్తుండడటంతో బరిలోకి దిగుతారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈ నెల 25న ఏపీ కాంగ్రెస్ అభ్యర్దుల జాబితా విడుదల కానుంది. పులివెందుల నుంచి జగన్ పోటీ చేస్తుండంతో టీడీపీ అభ్యర్దిగా బీటెక్ రవి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో ఉంటారనేది ఇంకా తేలలేదు. దీంతో, షర్మిల ఎంపీగానే పోటీ చేస్తారా..లేక ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలోకి దిగుతారా అనేది ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది.

కడప నుంచి పోటీ చేయాలని ఆమెపై కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి తెచ్చింది. హస్తం పెద్దల కోరిక మేరకు ఆమె కడప ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ నెల 25న కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయనున్నారు. అటు, రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చేలా షర్మిలతో పాటు ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విశాఖలో ‘న్యాయ సాధన సభ’ పేరిట నిర్వహించిన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు షర్మిలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కాగా, త్వరలోనే తొలి జాబితా విడుదల చేయనున్న నేపథ్యంలో ప్రచారం మరింత ముమ్మరం చేసేలా షర్మిల నేతలు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.  పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ‘ప్రజాగళం’ సభపై షర్మిల ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. అటు చంద్రబాబును, ఇటు జగన్ ను 2 పంజరాల్లో పెట్టుకుని ఆడిస్తోన్న రింగ్ మాస్టర్ బీజేపీ అంటూ మండిపడ్డారు. పదేళ్ల రాష్ట్ర వినాశనంలో ముఖ్య పాత్ర పోషించిన పార్టీ బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం అంటూ ఆమె నిప్పులు చెరిగారు. ‘కాంగ్రెస్, వైసీపీ ఒకటే అని ప్రధాని మోదీ కూతలా? ఐదేళ్లుగా జగన్ తో అంటకాగిందెవరు. వైసీపీ నేతల అరాచకాలను అడ్డుకోకుండా, ఎదురు వారికి అడ్డగోలు సహాయ సహకారాలు అందించింది బీజేపీ. ఇంకా నాశనం చేసుకోండి, ఇంకా అప్పుతెచ్చుకోండి అంటూ తెరచాటు స్నేహం నడిపింది ఎవరో,? దత్తపుత్రుడు అన్నది ఎవరినో.?’ అంటూ సెటైర్లు వేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు సిగ్గువిడిచి సపోర్ట్ చేసింది జగన్ రెడ్డి సర్కారు అని షర్మిల ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ మిత్రులు అదానీ, అంబానీలకు రాష్ట్రంలో ఆస్తులు కట్టపెట్టి, వారికీ రాజ్యసభ సీట్లు ఇచ్చింది జగన్ సర్కారు అని ఆరోపించారు. ఇది వీరి స్నేహం, విడదీయరాని బంధం అంటూ జగన్ పై సెటైర్లు వేశారు. ‘హామీలు ఇచ్చింది కాంగ్రెస్, వాటిని తుంగలో తొక్కింది బీజేపీ, టీడీపీ, వైసీపీ. ఇప్పుడు ఆ అసమర్థత, మోసాలను కప్పిపెట్టాలని కాంగ్రస్ మీద పసలేని దాడులు చేస్తున్నారు. అంటే కాంగ్రెస్‌కు మీరు భయపడుతున్నారా.?’ అని బీజేపీని వైఎస్ షర్మిల నిలదీశారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie