Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఘనంగా ఏఐటియుసి 104 ఆవిర్భావ దినోత్సవం

0

బద్వేలు

కార్మికహక్కులే ధ్యేయంగా, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం సమరశిల పోరాటాలకు సన్నద్ధం కావాలి
ఏఐటీయూసీ104వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బద్వేలు పట్టణంలోని పలుచోట్ల  మంగళవారం పథకాలను ఆవిష్కరించడం జరిగింది ఏఐటియుసి స్థాపించినప్పటి నుండి కార్మికుల హక్కుల కోసం దేశానికి స్వాతంత్ర సమపార్జన కొరకు 1920 అక్టోబర్ 31న బొంబాయి నగరంలో లాలాలజపతిరాయ్, పండిత్ జవహర్లాల్ నెహ్రూ ,డాంగే ఇంద్రజిత్ గుప్తా తదితరుల నాయకత్వాన ఏఐటియుసి ఆవిర్భవించిందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి వీరశేఖర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంపద సృష్టిలో భాగస్వామ్య కార్మికుల సంక్షేమం విస్మరించి, ప్రభుత్వరంగ సంస్థలను ఆదాని, అంబానీ కార్పొరేట్ కంపెనీలకు కట్టపెడుతూ, పోరాడి సాధించుకున్న బ్రిటిష్ కాలంనాటి కార్మికుల హక్కులను,చట్టాలను కాలరాస్తున్న మోడీ,జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు.

8 గంటల పని విధానం కోసం, కార్మికుల సమస్యల కోసం నిరంతరం 104 సంవత్సరాల కాలంలో ఎన్నో చట్టాలను, హక్కులను సాధించి పెడుతూ ముందుండి పోరాటం చేస్తూ ఎప్పటికప్పుడు సంఘాలు నిర్మిస్తున్న ఏకైక సంఘం ఏఐటియుసి ఒకటే అన్నారు. అసంఘటిత రంగ హమాలీల కోసం సమగ్ర సంక్షేమ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. స్కీం కార్మికులకు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఏరియా కార్యదర్శి పివి రమణ సిపిఐ పట్టణ కార్యదర్శి బాలు ఏఐటియుసి పట్టణ అధ్యక్షులు జిఎల్ నరసింహ పట్టణ ప్రధాన కార్యదర్శి ఇర్ల నాగేష్ మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు మల్లికార్జున కార్యదర్శి వెంకటసుబ్బయ్య మినీ లారీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రవీంద్ర భాష సుమో వర్కర్స్ యూనియన్ తంబి నాసర్ మరియు అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు,

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie