Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన గరుడ్ సుమిత్ సునీల్…

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించటమే లక్ష్యం : జిల్లా ఎస్పీ..

0

ఎలక్షన్ కమీషన్ వారి ఆదేశాల మేరకు ఇంటలిజెన్స్ (SIB) నుండి ప్రకాశం జిల్లా నూతన ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం జిల్లాలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేటట్లు చేయడమే తన ప్రథమ కర్తవ్యమన్నారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ స్వేచ్ఛాయుత, పారదర్శక, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తామన్నారు. గతంలో ప్రకాశం జిల్లాలో ట్రైనీ ఐపీఎస్ గా పనిచేశారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie