Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ప్రతిపక్ష పాత్రలో ప్రతిపక్ష పార్టీలు విఫలం -పిల్లల చదువులపై నిర్లక్ష్యంచేస్తే సహించేది లేదు -సింగరేణికి సహకరిస్తున్నా పిల్లల భవిష్యత్‌ను పట్టించుకోరా -నెల రోజుల్లోగా పాఠశాలలో సకల సౌకర్యాలు కల్పించాలే -సంస్థకు జెడ్పీ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌ హెచ్చరిక

0

మంథని

సమస్యల పరిష్కారంలో ప్రతపక్ష పాత్ర పోషించాల్సిన ప్రతిపక్ష పార్టీలు పూర్తిగా విఫలం అయ్యాయని బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి, జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ ఎద్దేవా చేశారు.

గురువారం రామగుండం రీజియన్-3 ఏరియా పరిధిలోని రామగిరి మండలం సెంటనరీకాలనీలోని సింగరేణి సంస్థ నుంచి లీజుకు తీసుకొని వాణి సెకండరీ స్కూల్ వారు నిర్వహించే పాఠశాలను ఆయన సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్బంగా పుట్ట మధు మాట్లాడుతూ సింగరేణి సంస్థ లీజుకు తీసుకొని వాణి సెకండరీ స్కూల్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే పాఠశాలలో కనీస వసతులు లేకుండా విద్యార్ధులను గాలికి వదిలేశారని ఆయన ఆరోపించారు. అవగాహన లేకుండా పిల్లలకు మంచి సౌకర్యాలు కల్పించడంలో సంస్థలు పూర్తిగా విఫలం అయ్యాయని ఆయన విమర్శించారు. సింగరేణి సంస్థ పరిధిలో ఓసీపీలు, గనుల నడువడానికి తాము సంపూర్ణ సహకారం అందిస్తున్నా మా పిల్లల చదువులపై సంస్థ నిర్లక్ష్యం చేయడం సహించరానిదన్నారు.

ఈనాడు సింగరేణి సంస్థ జీఎంలు స్థానికంగా ఉంటున్నా ఇక్కడి పాఠశాల నిర్వహణపై దృష్టిసారించకపోవడం దురదృష్ట కరమన్నారు. సంస్థ ఉత్పత్తి లాబాల మీద చూపించే శ్రద్ద ఉత్పత్తికి కారకులైన కార్మికుల పిల్లల భవిష్యత్‌పై చూపించకపోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. సింగరేణి సంస్థ పరిధిలోని ప్రతిపక్ష పార్టీల నాయకులు కార్మికుల పిల్లల భవిష్యత్‌ గురించి ఆలోచన చేయకపోవడం, ఇంత జరుగుతున్నా కనీసం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని, ప్రతిపక్షాలు సింగరేణి సంస్థకు అమ్ముడుపోయాయా అని ఆయన ప్రశ్నించారు.

ప్రతి పక్షాలు పదవులు, అధికారం, ఓట్ల కోసమే ఆరాటపడుతున్నారే తప్ప కార్మికుల పిల్లలకు మంచి చదువులు అందించి వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాలని ఎందుకు ఆలోచన చేయడం లేదని ఆయన అన్నారు. తాము అధికారంలో ఉన్నా కార్మికుల పిల్లల భవిష్యత్‌ ఆలోచన చేసి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తోందన్నారు. నెల రోజుల్లోగా పాఠశాలలో సకల సౌకర్యాలు కల్పించేలా సింగరేణి సంస్థ చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన, ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. అలాగే ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులు, టీబీజీకేఎస్‌నాయకులు నిత్యం కార్మికుల బిడ్డలు చదువుకునే పాఠశాలను పర్యవేక్షించాలని, వసతుల కల్పనపై దృష్టిపెట్టాలని ఆయన స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie