Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

బీఆర్ఎస్ తో కలిసేదే లేదు కిషన్ రెడ్డి

0

హైదరాబాద్

తెలంగాణాలో అసీంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలలో భయం ఎక్కువవుతోంది. ఈసారి జరగనున్న ఎన్నికలు అన్ని పార్టీలకు చాలా కీలకం కానున్నాయి. ఒకవేళ కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్  మళ్ళీ గెలిస్తే ఇక బీజేపీ, కాంగ్రెస్ లు తట్ట బుట్ట సర్దుకోవాల్సిందే, భవిష్యత్తులో ఇక కేసీఆర్ ను టచ్ చేసే అవకాశమే ఉండదు. అందుకే కాంగ్రెస్ మరియు బీజేపీలు గట్టిగా కేసీఆర్ ను ఓడించాలని విడివిడిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తాజాగా బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ మాపై ప్రచారం చేస్తున్నట్లుగా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ , బీజేపీ  లు కలిసి పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇది ముమ్మాటికీ తప్పు ప్రచారమేనని కిషన్ రెడ్డి గట్టిగా చెప్పారు. తెలంగాణాలో మా పోరు ఏకపక్షముగానే సాగుతుందని.. ఎవ్వరితోనూ పొత్తులు పెట్టుకోవలసిన అవసరం లేదన్నారు కిషన్ రెడ్డి.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie