Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ముఖ్యమంత్రి  పర్యటనకు పటిష్ట భధ్రత : కర్నూలు జిల్లా ఎస్పీ  జి. కృష్ణకాంత్

0

కర్నూల్
గురువారం తేదీన జగనన్న చేదోడు నాలుగవ విడత నగదు పంపిణీలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంకు ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి  రాక సందర్భంగా ఎమ్మిగనూరు వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ మైదానంలో ఏర్పాటు చేస్తున్న  బహిరంగ సభ మరియు ఓర్వకల్లు ఎయిర్ పోర్టు లో  జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్, భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఎమ్మిగనూరు బహిరంగ సభ  ఏర్పాట్ల పరిశీలనలో జిల్లా ఎస్పీ తో పాటు జిల్లా కలెక్టర్ డా.జి.సృజన,  ఎమ్మిగనూరు శాసనసభ్యులు చెన్నకేశవ రెడ్డి,  ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ ఉన్నారు.

ఎస్సై పరీక్షా కేంద్రాలను పరిశీలించిన డిఐజీ

బహిరంగ సభ, బ్యారికెడింగ్,  పార్కింగ్ ప్రదేశాలు, ట్రాఫిక్ క్రమబద్దీకరణ , ఇతర భద్రత ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. ముఖ్యమంత్రి  పర్యటన నిమిత్తం ఎమ్మిగనూరు – ఆదోని బైపాస్ నందు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ను  పరిశీలించారు. బందోబస్తు విధులు నిర్వహించే పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసు బృందాలు , పోలీసు జాగీలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ తెలిపారు.12 మంది డిఎస్పీలు, 56 మంది సిఐలు, 95 మంది ఎస్సైలు, 250 మంది  ఎఎస్సైలు / హెడ్ కానిస్టేబుళ్ళు, 600 మంది కానిస్టేబుళ్ళు, 60  మంది మహిళా పోలీసులు,  400 మంది హోంగార్డులు, 2 సెక్షన్ల ఎఆర్ పోలీసులు, 2 స్పెషల్ పార్టీ పోలీసు బృందాలను బందోబస్తు విధులకు కేటాయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ  వెంట అడిషనల్ ఎస్పీ అడ్మిన్ టి. సర్కార్, కర్నూలు పట్టణ డిఎస్పీ విజయశేఖర్, ఎమ్మిగనూరు డిఎస్పీ సీతా రామయ్య, కర్నూలు ఎస్సీ ఎస్టి సెల్ డిఎస్పీ యుగంధర్ బాబు, సిసియస్ డిఎస్పీ శ్రీనివాసులు,  సిఐలు  ప్రసాద్, శ్రీనివాస రెడ్డి,  మధుసూధన్ రావు, ఎరిషావలి మరియు ఇతర శాఖల అధికారులు  ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie