Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

వైసీపీలో చేరిన పోతిన

0

విజయవాడ,
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది వివిధ పార్టీల నేతలు అటు వాటు ఇటు ఇటు వారు అటు వెళ్తున్నారు. టికెట్ రాలేదని ఒకరు….ప్రాధాన్యత ఇవ్వలేదని మరికొందరు కండువాలు మార్చేస్తున్నారు. ఇన్నాళ్లు పడి కష్టానికి శ్రమ దక్కలేదని అప్పటి వరకు పని చేసినపార్టీకి శాపనార్థాలు పెట్టి మారీ వేరే పార్టీలోకి జంప్ చేస్తున్నారు. ఈ కోవలోని వ్యక్తి పోతిన మహేష్‌. జనసేన తరఫున ఎప్పటి నుంచో పని చేస్తున్న పోతిన మహేష్‌ విజయవాడ పశ్చిమ టికెట్‌ను ఆశించారు. అక్కడ టికెట్ వస్తుందని గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. అయితే పొత్తుల్లో భాగంగా ఆ టికెట్‌ను బీజేపీకి వెళ్లింది. ప్రస్తుతం అక్కడ బీజేపీ మాజీ ఎంపీ సుజనాచౌదరి కూటమి తరఫున పోటీ చేస్తున్నారు.  విజయవాడ పశ్చిమ టికెట్‌ తనను కాదని బీజేపీకి ఇవ్వడంపై పోతిన మహేష్‌ ఫైర్ అయ్యారు. తన లాంటి బీసీ నేతలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ సోమవారం జనసేనకు రాజీనామా చేశారు. జనసేన నుంచి విజయవాడ వెస్ట్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ పోతిన మహేష్‌ ఇవాళ వైసీపీలో చేరారు. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడినా గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ.. జనసేనకు గుడ్‌బై చెప్పి YCPలో చేరారు.

ఇంకా ఆగని ఓట్ల రచ్చ

ఉదయాన్నే భారీ ర్యాలీగా ఆయన విజయవాడ నుంచి బయలుదేరి పల్నాడు జిల్లా గంటావారిపాలెం చేరుకున్నారు. జగన్‌ బస్సుయాత్ర స్టే పాయింట్ దగ్గర అనుచరులతో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు.పి.గన్నవరం నియోకవర్గం జనసేనలో పాముల రాజేశ్వరి కీలక నేతగానే ఉన్నారు. ఐతే.. మారిన సమీకరణాలతో ఆమె జనసేనకు గుడ్‌బై చెప్పారు. YS జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. పార్టీ కండువా కప్పి ఆమెను ఆహ్వానించారు జగన్. 2009లో పి.గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రాజేశ్వరి. 2014లో పోటీకి దూరంగా ఉన్నా, తర్వాత YCPలో చేరారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి ఇప్పుడు YCP గూటికే చేరుకున్నారు.రాయచోటి తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు మాజీ ఎమ్మెల్యే R.రమేష్‌ కుమార్‌ రెడ్డి. దాదాపు పాతికేళ్లుగా ఆయనకు TDPతో అనుబంధం ఉంది. 1999లో టీడీపీ నుంచి MLAగా గెలిచారు. ఆయన సోదరుడు శ్రీనివాసులురెడ్డి కడప TDP అధ్యక్షుడిగా ఉన్నారు. ఈసారి రాయచోటి టికెట్‌ రెడ్డప్పగారి రమేష్‌ రెడ్డికి దక్కకపోవడంతో ఆయన వైసీపీలో చేరారు.ఆయా నియోజకర్గాల్లో అభ్యర్థుల గెలుపు ఓటముల్ని నిర్దేశించగల ఓటు బ్యాంక్‌ ఉన్న నేతలు.. టికెట్‌ దక్కకపోవడంతో YCPవైపు చూస్తున్నారు. ఎలాంటి కండిషన్లు లేకుండానే తామంతా పార్టీలో చేరామని నేతలంతా చెప్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie