China : 52 ఏళ్ల తర్వాత బయటపడ్డ టూత్‌బ్రష్:చైనాలో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా 52 సంవత్సరాల క్రితం మింగిన టూత్‌బ్రష్‌ను 64 ఏళ్ల వృద్ధుడి శరీరం నుంచి వైద్యులు విజయవంతంగా బయటకు తీశారు. కడుపు నొప్పితో ఆసుపత్రికి వచ్చిన యాంగ్ అనే వ్యక్తికి సాధారణ జీర్ణవ్యవస్థ పరీక్షలు చేస్తుండగా, అతని చిన్నపేగులో 17 సెంటీమీటర్ల పొడవైన టూత్‌బ్రష్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
వైద్య చరిత్రలో వింత
చైనాలో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా 52 సంవత్సరాల క్రితం మింగిన టూత్‌బ్రష్‌ను 64 ఏళ్ల వృద్ధుడి శరీరం నుంచి వైద్యులు విజయవంతంగా బయటకు తీశారు. కడుపు నొప్పితో ఆసుపత్రికి వచ్చిన యాంగ్ అనే వ్యక్తికి సాధారణ జీర్ణవ్యవస్థ పరీక్షలు చేస్తుండగా, అతని చిన్నపేగులో 17 సెంటీమీటర్ల పొడవైన టూత్‌బ్రష్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం, యాంగ్ తన 12వ ఏట ఈ టూత్‌బ్రష్‌ను పొరపాటున మింగానని గుర్తు చేసుకున్నారు. భయంతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదన్నారు. టూత్‌బ్రష్ దానంతట అదే కరిగిపోతుందని భావించానని చెప్పారు. అయితే, 52 ఏళ్లుగా బ్రష్ కడుపులోనే ఉన్నప్పటికీ యాంగ్‌కు ఎలాంటి తీవ్రమైన ఇబ్బంది కలగకపోవడం నిజంగా ఆశ్చర్యకరం.
ఈ విషయం తెలియగానే, వైద్యులు యాంగ్‌కు వెంటనే ఎండోస్కోపిక్ శస్త్రచికిత్స నిర్వహించారు. కేవలం 80 నిమిషాల్లో టూత్‌బ్రష్‌ను విజయవంతంగా తొలగించారు. గత మూడేళ్లలో ఒక రోగి జీర్ణవ్యవస్థ నుంచి వస్తువును తీయడానికి ఇంత ఎక్కువ సమయం పట్టడం ఇదే మొదటిసారి అని వైద్యులు పేర్కొన్నారు. పేగుల్లో ఇలాంటి వస్తువులు కదులుతూ లోపలి కణజాలాన్ని పాడుచేసి, ప్రాణాంతకమైన పేగుల చిల్లులు (ఇంటెస్టినల్ పెర్ఫొరేషన్) కలిగించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించారు.
యాంగ్ విషయంలో, టూత్‌బ్రష్ అదృష్టవశాత్తు పేగులోని ఒక వంపులో కదలకుండా స్థిరంగా ఉండిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని వైద్యులు వివరించారు. యాంగ్ శరీరం నుంచి టూత్‌బ్రష్‌ను విజయవంతంగా తొలగించిన ఈ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇన్నేళ్లపాటు శరీరానికి ఎలాంటి హానీ కలగకపోవడం అతని అదృష్టమని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
Read also:AP : వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్: సొంత మండలాలకు బదిలీకి ఛాన్స్!
