- ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన – చీనాబ్ రైల్వే వంతెన–ను ప్రజలకు అంకితం చేశారు. ఈ నిర్మాణం ద్వారా కశ్మీర్ లోయ, దేశంలోని ఇతర ప్రాంతాలతో రైలు మార్గం ద్వారా కలవడం ప్రారంభమైంది. ఇది ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ (USBRL) ప్రాజెక్టులో అత్యంత ప్రాముఖ్యమైన భాగంగా నిలిచింది.
ఈ ఉదయం ప్రధాని మోదీ ఉధంపూర్ లోని ఎయిర్ ఫోర్స్ బేస్‌కు చేరుకొని అక్కడి నుంచి చీనాబ్ వంతెన వద్దకు ప్రయాణించారు. అక్కడ ఆయన ఈ శిల్పకళా అద్భుతాన్ని అధికారికంగా ప్రారంభించారు. గత ఏప్రిల్‌లో పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం సరిహద్దును దాటి ‘ఆపరేషన్ సింధూర్’ నిర్వహించిన తర్వాత ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్‌లో తొలిసారి పర్యటించడం విశేషం.
చీనాబ్ నదిపై నిర్మితమైన ఈ వంతెనను ఇంజనీర్లు ప్రపంచ స్థాయిలోనే అత్యద్భుతంగా అభివర్ణిస్తున్నారు. వంతెన ప్రారంభానంతరం, భారతదేశపు తొలి కేబుల్ ఆధారిత రైల్వే వంతెన అయిన అంజి వంతెనను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు, ఇది జమ్మూ ప్రాంత రవాణాకు మరింత పునరుత్తేజన ఇస్తుంది.
అంతేకాకుండా, శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా – శ్రీనగర్ మధ్య రెండు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా ప్రధాని జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైళ్ల ద్వారా 272 కిలోమీటర్ల పొడవైన USBRL మార్గం పూర్తిగా అందుబాటులోకి రానుంది.
ఈ ప్రాజెక్టుల ద్వారా జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధి జోరందుకోవడం, పర్యాటకం, స్థానిక ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన వృద్ధి సాధ్యమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాశ్మీర్ లోయకు ఎల్లకాలాల్లోనూ నిరంతర రవాణా సౌకర్యం కల్పించాలనే దేశ కల, ఈ ప్రాజెక్టులతో సాకారమవుతోంది.
Read : Chandrababu : పర్యాటక రంగ అభివృద్ధి కోసం చంద్రబాబు కొత్త స్కెచ్
