RCB : చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట ఘటనపై కేసు రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన ఆర్సీబీ

rcp stamped
  • చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట ఘటనపై కేసు రద్దు చేయాలంటూ ఆర్సీబీ హైకోర్టును ఆశ్రయింపు

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట విషాద ఘటనపై తమపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) యాజమాన్యం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఘటనలో 11 మంది దుర్మరణం పాలవడం తెలిసిందే.

ఆర్సీబీ మరియు రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ లిమిటెడ్ (ఆర్‌సీఎస్‌ఎల్) తరఫున న్యాయవాది కోర్టుకు విన్నవిస్తూ, వారు ఈ కేసులో తప్పుగా ఇరికించబడ్డారని పేర్కొన్నారు. తమపై దాఖలైన కేసును రద్దు చేయాలని కోర్టును అభ్యర్థించారు.

ఈ ఘటనలో సంబంధితంగా ఐపీఎల్ సంబరాలను నిర్వహించిన డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూడా అదే విధంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఐపీఎల్‌లో ఆర్సీబీ విజయం సాధించిన అనంతరం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన విజయోత్సవాల్లో భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. దీంతో ఏర్పడిన తొక్కిసలాట వల్ల 11 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు.

ఈ ఘటనపై సమాచార హక్కు కార్యకర్త స్నేహమయి కృష్ణ ఫిర్యాదు చేయగా, కబ్బన్ పార్క్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో ఆర్సీబీ యాజమాన్యం, డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) సహా పలువురిపై కేసు నమోదు చేసినట్టు సమాచారం.

Read : RCB : తొక్కిసలాటల్లో 189 మంది మృతి

Related posts

Leave a Comment