Odisha : కుక్క కాటుకు గురైన 92 ఏళ్ల బామ్మ – వ్యాక్సిన్ కోసం 20 కి.మీ. నడక:ఒడిశాలోని నువాపడ జిల్లాలో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. 92 ఏళ్ల వృద్ధురాలు మంగళ్ బారి మోహరాను కుక్క కరవడంతో, యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కోసం ఏకంగా 20 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. సాధారణంగా నడవడమే కష్టంగా ఉండే ఈ బామ్మకు, ఈ సంఘటన తీవ్రమైన శారీరక, మానసిక ఇబ్బందులను కలిగించింది.
కుక్క కాటుకు గురైన 92 ఏళ్ల బామ్మ – వ్యాక్సిన్ కోసం 20 కి.మీ. నడక!
ఒడిశాలోని నువాపడ జిల్లాలో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. 92 ఏళ్ల వృద్ధురాలు మంగళ్ బారి మోహరాను కుక్క కరవడంతో, యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కోసం ఏకంగా 20 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. సాధారణంగా నడవడమే కష్టంగా ఉండే ఈ బామ్మకు, ఈ సంఘటన తీవ్రమైన శారీరక, మానసిక ఇబ్బందులను కలిగించింది.
వివరాల్లోకి వెళ్తే, ఇటీవల మోహరాను ఓ కుక్క కరిచింది. ఆమె స్థానికంగా అందుబాటులో ఉన్న వైద్యుడి వద్ద ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. అయితే, ఆ వైద్యుడు రేబిస్ వ్యాక్సిన్ తన వద్ద లేదని, సమీపంలోని సీనపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)కి వెళ్లి వేయించుకోవాలని సూచించారు.దాదాపు పది కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న సీనపల్లికి వెళ్లడానికి మోహరా గ్రామంలో రవాణా సౌకర్యం లేదు.
దీనికి తోడు, రాష్ట్రంలో ప్రైవేటు వాహనాల డ్రైవర్లు సమ్మెకు దిగడంతో గత రెండు రోజులుగా రవాణా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో చేసేదేంలేక, వయోభారం, కుక్క కాటు గాయంతో బాధపడుతున్నప్పటికీ, మోహరా కాలినడకనే బయలుదేరారు. ఎంతో కష్టపడి నడుచుకుంటూ ఆమె సీనపల్లి CHC చేరుకుని వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత, తిరిగి అదే పది కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ తన గ్రామానికి చేరుకున్నారు.
Read also:TechJobs : డిగ్రీలు అక్కర్లేదు, టాలెంట్ ఉంటే చాలు: రూ.40 లక్షల జీతంతో ఉద్యోగం ఆఫర్!
