Cybercrime : ఒక పాస్వర్డ్ చేసిన పని: 700 ఉద్యోగాలు గాల్లో కలిశాయి:ఒక పాస్వర్డ్ విషయంలో జరిగిన నిర్లక్ష్యం 158 ఏళ్లుగా విజయవంతంగా నడుస్తున్న ఒక కంపెనీ మూతపడడానికి దారితీసింది. ఈ సంఘటనతో సుమారు 700 మంది ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోనున్నారు. ఈ దుస్థితికి కారణం కేవలం ఒక బలహీనమైన పాస్వర్డ్.
బలహీనమైన పాస్‌వర్డ్‌తో భారీ మూల్యం: 158 ఏళ్ల సంస్థ మూసివేత
ఒక పాస్వర్డ్ విషయంలో జరిగిన నిర్లక్ష్యం 158 ఏళ్లుగా విజయవంతంగా నడుస్తున్న ఒక కంపెనీ మూతపడడానికి దారితీసింది. ఈ సంఘటనతో సుమారు 700 మంది ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోనున్నారు. ఈ దుస్థితికి కారణం కేవలం ఒక బలహీనమైన పాస్వర్డ్.
సైబర్ నేరగాళ్లు పటిష్టంగా లేని పాస్‌వర్డ్‌ను ఉపయోగించి కంపెనీ సిస్టమ్‌లోకి ప్రవేశించారు. కీలకమైన సమాచారాన్ని తమ నియంత్రణలోకి తీసుకుని, ఉద్యోగులకు ఆ సమాచారం అందుబాటులో లేకుండా చేశారు. దీంతో సంస్థ కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ ఘోరమైన పరిస్థితి యూకేకు చెందిన ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీ **‘కెఎన్‌పీ లాజిస్టిక్స్’కు ఎదురైంది.ఎలా జరిగింది?
‘నైట్ ఆఫ్ ఓల్డ్ బ్రాండ్’ పేరుతో కేఎన్పీ లాజిస్టిక్స్ కంపెనీకి చెందిన 500 లారీలు నిత్యం దేశవిదేశాలకు కస్టమర్ల సరుకులను చేరవేస్తుంటాయి. ఇటీవల, కంపెనీ ఉద్యోగులలో ఒకరి పాస్‌వర్డ్‌ను ఊహించిన హ్యాకర్లు కేఎన్పీ సిస్టమ్‌లోకి ఎంటరయ్యారు. సంస్థ ఉద్యోగులకు పలు కీలక సమాచారం పొందేందుకు వీలు లేకుండా చేశారని కేఎన్పీ డైరెక్టర్ పాల్ అబాట్ వివరించారు.
హ్యాకర్లు భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్నారని, అంత మొత్తం ఇచ్చే పరిస్థితి తమకు లేదని పాల్ అబాట్ తెలిపారు. దీంతో తమ ముందు ఉన్న ఏకైక మార్గం కంపెనీని మూసివేయడమేనని ఆయన విచారం వ్యక్తం చేశారు. అయితే, హ్యాకర్లు ఎంత డబ్బు డిమాండ్ చేశారనేది పాల్ అబాట్ వెల్లడించలేదు.
సైబర్ నిపుణుల అంచనాల ప్రకారం, ఈ హ్యాకింగ్ అకీరా గ్యాంగ్ పనే అయి ఉంటుందని, వారు సుమారు 50 లక్షల పౌండ్ల (సుమారు ₹52 కోట్లు) వరకు డిమాండ్ చేసి ఉండవచ్చని అంచనా. ఈ సైబర్ దాడి కారణంగా కంపెనీ మూతపడితే, సంస్థలోని 700 మంది ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోవడం ఖాయం.
Read also:MaheshKumarGoud : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: కాంగ్రెస్ విజయం ఖాయం – మహేశ్ కుమార్ గౌడ్
