Altman : డేటా గోప్యతపై ఆల్ట్‌మన్ షాకింగ్ వ్యాఖ్యలు:చాట్ జీపీటీ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో చాట్ జీపీటీ అంత నమ్మదగిన టెక్నాలజీ కాదని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచిన ఆల్ట్‌మన్, ఇప్పుడు యూజర్లు చాట్ జీపీటీతో పంచుకునే సమాచారం రహస్యంగా ఉండదని తేల్చి చెప్పారు.
షాకింగ్ న్యూస్: చాట్ జీపీటీలో మీ డేటా సేఫ్ కాదు!
చాట్ జీపీటీ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో చాట్ జీపీటీ అంత నమ్మదగిన టెక్నాలజీ కాదని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచిన ఆల్ట్‌మన్, ఇప్పుడు యూజర్లు చాట్ జీపీటీతో పంచుకునే సమాచారం రహస్యంగా ఉండదని తేల్చి చెప్పారు. ఆల్ట్‌మన్ చెప్పిన దాని ప్రకారం, అవసరమైనప్పుడు, ముఖ్యంగా న్యాయపరమైన అంశాల్లో, యూజర్ల సమాచారాన్ని బయటపెట్టాల్సి వస్తుందట. కోర్టు ఉత్తర్వులు వస్తే, యూజర్లకు సంబంధించిన ఎలాంటి డేటానైనా వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఇక, చాట్ జీపీటీలో డిలీట్ చేసిన మెసేజ్‌లు, చిత్రాల గురించి మాట్లాడుతూ, న్యాయపరమైన చిక్కులు వస్తే వాటిని భద్రపరుస్తామని, లేదంటే 30 రోజుల తర్వాత వాటిని శాశ్వతంగా తొలగిస్తామని ఆల్ట్‌మన్ వివరించారు.కాబట్టి, చాట్ జీపీటీ ఉపయోగిస్తున్నప్పుడు మీ వ్యక్తిగత లేదా సున్నితమైన సమాచారాన్ని పంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.
Read also:NorthKorea : ఉత్తర కొరియా మోసం: 50 ఏళ్లుగా వోల్వో అప్పు తీరని కథ!
