NitishKumarReddy : నితీశ్ కుమార్ రెడ్డి సత్తాకు కుంబ్లే ప్రశంసలు: లార్డ్స్ లో ఆకట్టుకున్న తెలుగు తేజం:తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి లార్డ్స్ టెస్టులో తన అద్భుతమైన బౌలింగ్‌తో తొలి రోజు ఆటలో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌ను నితీశ్ కుమార్ రెడ్డి ఒకే ఓవర్‌లో రెండు కీలక వికెట్లు పడగొట్టి దెబ్బకొట్టాడు.
నితీశ్ కు అండగా నిలవండి: బీసీసీఐకి అనిల్ కుంబ్లే సూచన
తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి లార్డ్స్ టెస్టులో తన అద్భుతమైన బౌలింగ్‌తో తొలి రోజు ఆటలో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌ను నితీశ్ కుమార్ రెడ్డి ఒకే ఓవర్‌లో రెండు కీలక వికెట్లు పడగొట్టి దెబ్బకొట్టాడు. నితీశ్ ప్రదర్శనపై టీమిండియా బౌలింగ్ దిగ్గజం అనిల్ కుంబ్లే ప్రశంసలు కురిపించాడు.
నితీశ్ బౌలింగ్ తనను ఆశ్చర్యపరిచిందని కుంబ్లే పేర్కొన్నాడు. సరైన ప్రదేశాల్లో బంతులు వేయడం అతడి ప్రత్యేకత అని కొనియాడాడు. తొలి వికెట్ కాస్త అనుకోకుండా వచ్చినట్లు అనిపించినా, రెండో వికెట్ మాత్రం అద్భుతమైన బంతితో సాధించాడని వివరించాడు. తొలి రోజు నితీశ్‌తో కేవలం 14 ఓవర్లే వేయించినా, అతడిలో ఇంకా బౌలింగ్ చేసే ఉత్సాహం స్పష్టంగా కనిపించిందని కుంబ్లే అభిప్రాయపడ్డాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీ చేసి బ్యాటింగ్‌లో తన సత్తా చాటడని, ఆ సిరీస్‌లో ఎక్కువ వికెట్లు తీయలేకపోయినా, కీలక సమయాల్లో బ్రేక్‌త్రూ ఇవ్వగల బౌలర్ అని నిరూపించుకున్నాడని కుంబ్లే గుర్తుచేశాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లోనే కాదు, ఫీల్డింగ్‌లోనూ నితీశ్ చురుగ్గా ఉంటాడని తెలిపాడు. అందుకే, నితీశ్ కుమార్ రెడ్డికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని, అతడిని జట్టు నుంచి తొలగించకుండా ప్రోత్సహించాలని కుంబ్లే సూచించాడు. ఒకవేళ అతడు విఫలమైనా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. నితీశ్ విషయంలో బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ చూపాలని కుంబ్లే విజ్ఞప్తి చేశాడు.
Read also:Kavitha : బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్-బీఆర్ఎస్ రగడ: కవితపై మహేష్ గౌడ్ ఆగ్రహం
