Nidhhi Agerwal : ‘హరిహర వీరమల్లు’ ఆలస్యంపై నిధి అగర్వాల్ వివరణ: పవన్ కల్యాణ్ కృషి అద్భుతం:ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ విడుదల తేదీ దగ్గర పడుతోంది. ఈ క్రమంలో, హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రమోషన్లలో చురుకుగా పాల్గొంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిధి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
హరిహర వీరమల్లు: నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ విడుదల తేదీ దగ్గర పడుతోంది. ఈ క్రమంలో, హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రమోషన్లలో చురుకుగా పాల్గొంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిధి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఈ సినిమా షూటింగ్ చాలా సమయం తీసుకుందని కొందరు అంటున్నారని.. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఉంటూనే సినిమాకు చాలా సమయాన్ని కేటాయించారని చెప్పింది. ఆయన ఎంతో కష్టపడ్డారని తెలిపింది.
సినిమాకు అంత సీన్ లేదని, అందుకే ఆలస్యం అవుతోందని కామెంట్లు వచ్చాయని.. అయితే ట్రైలర్ విడుదలయ్యాక ఆ విమర్శలకు చెక్ పడిందని నిధి వ్యాఖ్యానించింది. ఇప్పుడు సినిమా అద్భుతంగా ఉందనే కామెంట్లు వస్తున్నాయని.. అందుకే పుకార్లను నమ్మవద్దని చెప్పింది.మరోవైపు ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ నెల 20న వైజాగ్‌లో నిర్వహించనున్నారు. ఈ చిత్రం జూలై 24, 2025న థియేటర్లలో విడుదల కానుంది.
Read also:Singapore : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం సింగపూర్ – తాజా నివేదిక
