Kejriwal : నోబెల్ బహుమతిపై కేజ్రీవాల్ కామెంట్లు: బీజేపీ ఎదురుదాడి

Kejriwal's Nobel Prize Remark Sparks Political Row: BJP and AAP Clash

Kejriwal : నోబెల్ బహుమతిపై కేజ్రీవాల్ కామెంట్లు: బీజేపీ ఎదురుదాడి:త‌న పాల‌న‌కు నోబెల్ బ‌హుమ‌తి ఇవ్వాల‌ని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్య‌మంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. మంగ‌ళ‌వారం చండీగ‌ఢ్‌లో జ‌రిగిన ‘ది కేజ్రీవాల్ మోడ‌ల్’ పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

కేజ్రీవాల్ నోబెల్ వ్యాఖ్యలు: ఢిల్లీ రాజకీయాల్లో దుమారం

త‌న పాల‌న‌కు నోబెల్ బ‌హుమ‌తి ఇవ్వాల‌ని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్య‌మంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. మంగ‌ళ‌వారం చండీగ‌ఢ్‌లో జ‌రిగిన ‘ది కేజ్రీవాల్ మోడ‌ల్’ పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ.. “ఢిల్లీలో లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌తో స‌హా ఎన్నో శ‌క్తులు మా ప్ర‌భుత్వాన్ని అడ్డుకున్నా, మేము అద్భుతంగా ప‌నిచేశాం. ఇన్ని అడ్డంకుల మ‌ధ్య ఇంత గొప్ప పాల‌న అందించినందుకు నాకు నోబెల్ బ‌హుమ‌తి ఇవ్వాలి” అని అన్నారు.

కేజ్రీవాల్ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ ఢిల్లీ అధ్య‌క్షుడు వీరేంద్ర స‌చ్‌దేవా తీవ్రంగా మండిప‌డ్డారు. “అస‌మ‌ర్థ‌త‌, అరాచ‌కం, అవినీతి విభాగాల్లో నోబెల్ బ‌హుమ‌తి ఉండుంటే కేజ్రీవాల్‌కు త‌ప్ప‌కుండా వ‌చ్చేది” అని ఎద్దేవా చేశారు. లిక్క‌ర్ స్కామ్, బ‌స్సుల్లో పానిక్ బ‌ట‌న్లు, త‌ర‌గ‌తి గ‌దుల నిర్మాణం, ముఖ్య‌మంత్రి నివాస‌మైన ‘షీష్ మ‌హ‌ల్’ వివాదం వంటి ఎన్నో కుంభ‌కోణాలు కేజ్రీవాల్ హ‌యాంలో జ‌రిగాయ‌ని ఆయ‌న ఆరోపించారు.

బీజేపీ విమ‌ర్శ‌ల‌పై ఆప్ కూడా ఘాటుగా బ‌దులిచ్చింది. బీజేపీ నేత‌లు విమ‌ర్శ‌లు మాని పాల‌న‌పై దృష్టి పెట్టాల‌ని ఆప్ మాజీ మంత్రి సౌర‌భ్ భ‌ర‌ద్వాజ్ హిత‌వు ప‌లికారు. “ఇక ప్ర‌తిప‌క్షంలో ఉన్న రోజులు పోయాయి, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. మాటలు కాదు, చేత‌లే కావాలని ఢిల్లీ ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్నారు” అని ఆయ‌న అన్నారు.

Read also:Himachal Floods : కుక్క అరుపుతో బతికిన 20 కుటుంబాలు: మండి జిల్లాలో ఘటన

 

Related posts

Leave a Comment