NorthKorea : ఉత్తర కొరియా మోసం: 50 ఏళ్లుగా వోల్వో అప్పు తీరని కథ!

North Korea's 50-Year Debt: The Unpaid Volvo Bill

NorthKorea : ఉత్తర కొరియా మోసం: 50 ఏళ్లుగా వోల్వో అప్పు తీరని కథ:ప్రపంచం ఒకవైపు ఉంటే, ఉత్తర కొరియా మాత్రం ఎప్పుడూ మరోవైపు ఉంటుంది. నియంతృత్వ పాలన, పాతకాలపు జీవనశైలితో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రజలను ఎలా నియంత్రిస్తారో ప్రపంచానికి తెలిసిందే. అలాంటి ఉత్తర కొరియాతో స్వీడన్‌కు చెందిన వోల్వో కంపెనీకి ఓ వింత అనుభవం ఎదురైంది.

50 ఏళ్లుగా తీరని అప్పు: ఉత్తర కొరియా మోసం, స్వీడన్‌కు చేదు అనుభవం!

ప్రపంచం ఒకవైపు ఉంటే, ఉత్తర కొరియా మాత్రం ఎప్పుడూ మరోవైపు ఉంటుంది. నియంతృత్వ పాలన, పాతకాలపు జీవనశైలితో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రజలను ఎలా నియంత్రిస్తారో ప్రపంచానికి తెలిసిందే. అలాంటి ఉత్తర కొరియాతో స్వీడన్‌కు చెందిన వోల్వో కంపెనీకి ఓ వింత అనుభవం ఎదురైంది. ఇది 1974 నాటి మాట. వెయ్యి వోల్వో కార్లను ఉత్తర కొరియాకు సరఫరా చేసేందుకు స్వీడిష్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది.

ఆ సమయంలో ఈ ఒప్పందాన్ని వోల్వో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించింది. ఉత్తర కొరియాలో తమ కంపెనీ విస్తరిస్తుందని ఆశించింది. ఒప్పందం ప్రకారం వెయ్యి కార్లను వేగంగా ఎగుమతి చేసింది. అయితే, ఇక్కడే అసలు సమస్య మొదలైంది. కార్లను అందుకున్న ఉత్తర కొరియా, వాటికి పైసా కూడా చెల్లించలేదు!

ఆ వెయ్యి కార్ల విలువ అప్పట్లోనే $73 మిలియన్ డన్లు. “ఇప్పుడో అప్పుడో చెల్లిస్తారులే” అని స్వీడిష్ కంపెనీ ఆశగా ఎదురుచూసింది. కానీ 50 ఏళ్లు గడిచినా, ఉత్తర కొరియా నుంచి ఒక్క డాలరు కూడా రాలేదు! ఈ మోసంపై అంతర్జాతీయ మీడియాలోనూ పలు కథనాలు వచ్చాయి. స్వీడన్ కంపెనీ ఎన్ని లేఖలు రాసినా ఫలితం లేకపోయింది.

నాడు $73 మిలియన్లుగా ఉన్న ఆ మొత్తం, ఇప్పుడు వడ్డీతో కలిపి ఏకంగా $330 మిలియన్లకు చేరింది! మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 50 ఏళ్ల క్రితం సరఫరా చేసిన ఆ వోల్వో కార్లను ఉత్తర కొరియా ఇప్పటికీ ఉపయోగిస్తోంది! విదేశీ ప్రతినిధులు, జర్నలిస్టులు తమ దేశానికి వచ్చినప్పుడు, వారిని తిప్పడానికి ఈ పాత వోల్వో కార్లనే వాడుతుండటం గమనార్హం.

Read also:SupremeCourt : విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు: దేశవ్యాప్తంగా అమలు.

 

 

Related posts

Leave a Comment